For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ram Charan లోబో స్టైల్ డ్రెస్సింగ్.. రాంచరణ్ ధరించిన జాకెట్ ధర ఎంతో తెలుసా?

  |

  సినీతారలు ధరించే దుస్తులు, వాచీలు, షూస్, అలాగే బ్యాగ్ కొన్నిసార్లు అభిమానులకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతుంటాయి. అలాంటి వస్తువులు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో ఎన్నో ఘనతలు సాధించి మీడియాలో ట్రెండింగ్‌ మారిన రాంచరణ్.. మరోసారి ఫ్యాన్స్‌కు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఇటీవల బిగ్‌బాస్ వేదికపై మెరిసిన చెర్రీ ధరించిన డిజైనర్ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ షర్ట్ బ్రాండ్, ధర వివరాల్లోకి వెళితే..

   డిస్నీ+హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా

  డిస్నీ+హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ పరంగా, ప్రొఫెషనల్‌గా దూసుకెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఆ సందర్భంగా షూట్ చేసిన ప్రోమోను ఆవిష్కరించడానికి బిగ్‌బాస్ తెలుగు 5 వేదిక మీదకు వచ్చారు. హోస్ట్ నాగార్జునతో కలిసి స్టేజ్ మీద హంగా సృష్టించారు. అయితే ఆ సమయంలో రాంచరణ్ ధరించిన షర్ట్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది.

  బిగ్‌బాస్ వేదికపైన

  బిగ్‌బాస్ వేదికపైన

  బిగ్‌బాస్ తెలుగు 5 వేదిక మీద నుంచి రాంచరణ్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ లోబోతో సరదాగా వ్యవహరించారు. లోబో హెయిర్ స్టైల్, డ్రెస్పింగ్ స్టైల్ గురించి చర్చించారు. అంతేకాకుండా తాను కూడా స్టైల్ విషయంలో లోబోను ఫాలో అయ్యాను అంటూ చెప్పారు. దాంతో లోబో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అంతేకాకుండా నేను లోబోలా డ్రస్పింగ్ చేసుకొని వచ్చానని రాంచరణ్ చెప్పారు. అంతేకాకుండా వేదిక మీద తన జాకెట్‌ను కూడా చూపించారు.

  సోషల్ మీడియాలో రాంచరణ్ జాకెట్ వైరల్

  సోషల్ మీడియాలో రాంచరణ్ జాకెట్ వైరల్

  అయితే బిగ్‌బాస్ వేదిక మీదకు వచ్చిన సమయంలో రాంచరణ్ ధరించిన జాకెట్ ఖరీదైనదనే విషయం సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేశారు. ఆ షర్ట్ బ్రాండ్‌ను వెల్లడిస్తూ మరింత సమాచారం అందించారు. ఆ షర్ట్‌ను డస్ట్ ఆఫ్ గాడ్స్ జోకర్ అనే బ్రాండ్‌కు సంబంధించినది. డెనిమ్, ఫ్లానెల్‌ ఫ్యాబ్రిక్‌తో ఆ జాకెట్‌ను రూపొందించారు. ఆ షర్ట్‌పై రకరకాల డిజైన్లు, ఘోస్ట్ బొమ్మ, పైకి ఉబికి వచ్చిన దెయ్యం చేయి కనిపించాయి. ఇన్ డస్ట్ వీ ట్రస్ట్, జస్ట్ ఆఫ్ ఫుడ్ అనే లైన్‌ కూడా ప్రింట్ చేశారు. దాంతో అది ప్రత్యేక ఆకర్షణగా మారింది.

   జాకెట్ ధర ఎంతంటే?

  జాకెట్ ధర ఎంతంటే?

  అయితే డిజైనర్ దుస్తుల విషయంలో డస్ట్ ఆఫ్ గాడ్స్ జోకర్‌కు మంచి పాపులారిటీ ఉంది. ఈ బ్రాండ్‌ అంటే సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడుతారు. సినీ తారులు, ఇతర సెలబ్రిటీలు ఎక్కువగా ఈ బ్రాండ్ వస్తువులను ధరించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారుతారు. అయితే రాంచరణ్ ధరించిన డిజైనర్ జాకెట్ ధర పన్నులు మినహాయించి1750 డాలర్లు. అంటే ఈ షర్ట్ ధర సుమారు రూ.1 లక్ష 50 వేల రూపాయలుగా అంచనా వేయవచ్చు.

   సిద్దార్థ్ మల్హోత్రా, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు

  సిద్దార్థ్ మల్హోత్రా, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు

  రాంచరణ్ ధరించిన డస్ట్ ఆఫ్ గాడ్స్ జోకర్ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు సిద్దార్థ్ మల్హోత్రా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. రాంచరణ్ ధరించిన జాకెట్‌‌‌ను వేసుకొని ప్రమోషన్ చేశారు. ప్రస్తుతం ఈ జాకెట్‌ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ బ్రాండ్ దుస్తులను, జాకెట్స్‌ను పలు సందర్బాల్లో షారుక్ ఖాన్, కరణ్ జోహర్ లాంటి ప్రముఖులు ధరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

  Ikshu Movie Hero Ram Agnivesh Birthday Celebrations
  రాంచరణ్ సినీ కెరీర్ ఇలా..

  రాంచరణ్ సినీ కెరీర్ ఇలా..

  ఇక రాంచరణ్‌ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం భారీ, క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన RRR చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతున్నది. అలాగే శంకర్, దిల్ రాజు దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు రణ్‌వీర్ సింగ్ స్పెషల్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే.

  English summary
  Mega Power Star Ramcharan wore Dust of gods JOKER DENIM/FLANNEL Jacket. It cost around $1750+ tax. In terms of rupees, It cost 1 lakh 30 thousand.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X