For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాక్ ఆఫ్ ది టౌన్: మరోసారి పవన్‌తో కలవనున్న రేణు దేశాయ్.. వెరీ ఇంట్రెస్టింగ్ మేటర్ గురూ.!

  By Manoj Kumar P
  |

  రేణూ దేశాయ్.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పరిచయం చేయనవసరం లేని పేరిది. మోడలింగ్ రంగంలో నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయకున్నా.. పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ను వివాహం చేసుకుని వార్తల్లోకి ఎక్కింది. చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురం.. కొన్నేళ్ల క్రితం విడాకుల వరకు వెళ్లింది. దీంతో ఈ ఇద్దరూ విడిపోయారు. అయితే, తాజాగా రేణు దేశాయ్.. పవన్‌తో కలవడానికి సిద్ధం అయిందని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. వివరాలు...

  తొలి పరిచయంతోనే ప్రేమ.. పెళ్లి

  తొలి పరిచయంతోనే ప్రేమ.. పెళ్లి

  పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘బద్రీ' సినిమాలో రేణు దేశాయ్ - పవన్ కల్యాణ్ కలిసి నటించారు. ఈ సినిమాతోనే వాళ్లిద్దరికీ మొదటిసారి పరిచయం అయింది. ఆ తర్వాత ప్రేమలో పడిన ఈ ఇద్దరు.. పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే, ఈ మధ్య రేణు దేశాయ్ - పవన్ కల్యాణ్ విడాకులు తీసుకున్నారు.

   పవన్‌తోనే ఆఖరు.. ఇలా ప్రయత్నించింది

  పవన్‌తోనే ఆఖరు.. ఇలా ప్రయత్నించింది

  రేణు.. తెలుగులో రెండు సినిమాల్లోనే నటించింది. అందులో మొదటిది ‘బద్రీ' కాగా, రెండోది ‘జానీ'. వీటితో పాటు ‘జేమ్స్ పాండూ' అనే తమిళ చిత్రంలోనూ ఆమె నటించింది. ఇక, ఈ మధ్య ‘ఇష్క్ వాలా లవ్' అనే చిత్రంతో దర్శకత్వం రంగంలోకీ వెళ్లింది. అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించింది. అంతేకాదు, కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ పని చేసింది.

  యంగ్ హీరోతో కలిసి వస్తుందన్నారు

  యంగ్ హీరోతో కలిసి వస్తుందన్నారు

  పవన్‌తో విడిపోయిన తర్వాత పూణెలో నివాసం ఉంటోంది రేణూ దేశాయ్. ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో మంచి కథలతో వస్తే తెలుగులో సినిమాలు చేస్తానని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించనున్న సినిమాతో ఆమె రీఎంట్రీ ఇస్తుందని అన్నారు. ‘దొంగాట' డైరెక్టర్ వంశీ కృష్ణ దీనిని తెరకెక్కించనున్నాడు.

  వాళ్ల ఒత్తిడితో షాకిచ్చిన రేణూ దేశాయ్

  వాళ్ల ఒత్తిడితో షాకిచ్చిన రేణూ దేశాయ్

  వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు రేణూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే, ఆమె సన్నిహితులు కొందరు ఒత్తిడి చేయడం వల్ల దీని నుంచి తప్పుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం.. రేణు దేశాయ్ సహాయ నటి పాత్రలు చేయడం కంటే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మెయిన్ లీడ్ చేయడమే బెటర్ అని వాళ్ల ఉద్దేశ్యమని సమాచారం.

  మరోసారి పవన్‌తో కలవనున్న రేణు దేశాయ్

  మరోసారి పవన్‌తో కలవనున్న రేణు దేశాయ్

  ఇక, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రేణు దేశాయ్ త్వరలోనే పవన్ కల్యాణ్‌తో కలవబోతుందట. అయితే, ఇది సినిమాలో మాత్రమేనని సమాచారం. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పింక్' రీమేక్‌లో ఓ తల్లికి బిడ్డగా నటించాల్సిన పాత్ర ఉంటుందట. దానికి నిర్మాత దిల్ రాజు.. రేణూ దేశాయ్ పేరును ఎంపిక చేశారని, దీనికి పవన్ కూడా అభ్యంతరం తెలుపలేదని అంటున్నారు.

  రేణూ ఏం చేస్తుందో.. వెరీ ఇంట్రెస్టింగ్

  రేణూ ఏం చేస్తుందో.. వెరీ ఇంట్రెస్టింగ్

  ఈ సినిమాలో రేణూ దేశాయ్‌ను నటింపేజేసేందుకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథను కూడా ఆమెకు వినిపించాడట దర్శకుడు వేణు శ్రీరామ్. అయితే, తన నిర్ణయాన్ని త్వరలోనే తెలియజేస్తానని ఆమె వాళ్లకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

  English summary
  Renu Desai is a Gujarati. She has a son, born in 2004 with Tollywood actor Pawan Kalyan, whom she married in 28 January 2009. The couple also has a daughter born in 2010. They have reportedly filed for divorce as of 2011.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X