twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rishi Kapoor Death Anniversary: ఆ కోరిక తీరకుండానే రొమాంటిక్ హీరో మరణం.. తండ్రి కోసం రణబీర్ ఏం చేశాడంటే..

    |

    ప్రముఖ నటుడు, దివంగత రిషికపూర్ ఈ లోకాన్ని విడిచి ఏడాది పూర్తయింది. 80, 90 దశకంలో రొమాంటిక్ హీరోగా యువతను ఎంతగానో ఆకట్టుకొన్న ఈ చాక్లెట్ బాయ్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఏప్రిల్ 30వ తేదీన కన్నుమూశారు. ప్రతిభావంతుడైన నటుడు మరణ విషాదాన్ని ఇంకా అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మనల్ని వీడిన రిషికపూర్ జీవితంలోకి కొన్ని మధురస్మ‌ృతులు, కొన్ని సంఘటనలు మీ కోసం...

    బాల నటుడిగా తండ్రి దర్శకత్వంలో

    బాల నటుడిగా తండ్రి దర్శకత్వంలో

    ప్రసిద్ధ దర్శకుడు, తండ్రి రాజ్‌కపూర్ దర్శకత్వంలో మేరా నామ్ జోకర్ చిత్రంతో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత తండ్రి దర్శకత్వంలోనే బాబీ చిత్రంలో హీరోగా డింపుల్ కాపాడియాతో నటించారు. ఆ తర్వాత ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో నటించి మెప్పించారు. యూత్‌ఫుల్, రొమాంటిక్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

    50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో

    50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో

    బాలీవుడ్‌లో 50 ఏళ్లపాటు హీరోగా, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలు పోషించారు. ఆయన సినీ జీవితాన్ని రెండు భాగాలుగా తీసుకొంటే.. తొలి భాగమంతా ఆటలుపాటలతోనే గడిచిపోయింది. బాబీ, కభీకభీ, కర్జ్, ప్రేమ్ రోగ్, సాగర్, అమర్ అక్బర్ ఆంథోని, హమ్ కిసీసే కమ్ నహీ లాంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. హీరోగా చివరి రోజుల్లో సర్గమ్, చాందినీ, బోల్ రాధా భోల్, దీవానా చిత్రాలతో అదరగొట్టారు.

    నటుడిగా సెకండ్ ఇన్సింగ్స్‌లో

    నటుడిగా సెకండ్ ఇన్సింగ్స్‌లో

    ఇక తన కెరీర్ రెండో భాగంలో నటుడిగా రిషీ కపూర్ నటుడిగా విజృంభించారు. కపూర్ అండ్ సన్స్, ముల్క్, దో దూనీ చార్, లవ్ ఆజ్ కల్, అగ్నిపథ్, 102 నాటౌట్ లాంటి చిత్రాలతో ఆకట్టుకొన్నారు. లవ్ ఆజ్ కల్ చిత్రానికి ప్రొడ్యూసర్ గిల్డ్ అవార్డును, దో దూని ఛార్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు, అగ్నిపథ్ చిత్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు, కపూర్ అండ్ సన్స్ సినిమాకు పలు అవార్డులను సొంత చేసుకొన్నారు.

    క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ..

    క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ..

    తన కెరీర్‌ రెండో భాగంలో నటుడిగా విశేషంగా ఆకట్టుకొంటున్న సమయంలోనే రిషికపూర్ క్యాన్సర్ వ్యాధిన పడ్డారు. అమెరికాలో చిక్సిత పొందడం ద్వారా ఆరోగ్యం కుదుటపడినట్టే కనిపించింది. లాక్‌డౌన్ సమయంలో రిషీ ఈ లోకాన్ని వీడిపోయారు. క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత మళ్లీ నటించాలని బలంగా కోరుకొన్నారు. కానీ ఆ కోరిక తీరకుండా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించారు.

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
    తండ్రి ఆత్మకథను రణ్‌బీర్ తెరపైకి

    తండ్రి ఆత్మకథను రణ్‌బీర్ తెరపైకి

    రిషికపూర్ మరణాంతరం ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తన తండ్రి జీవిత కథను ఖుల్లామ్ ఖుల్లా: రిషికపూర్ అన్‌సెన్సార్డ్ పేరుతో పుస్తకరూపంలోకి తెచ్చారు. తన తండ్రి జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని పుస్తకంలో తెలిపారు. ఏది ఏమైనా రిషి లాంటి హీరోను, నటుడిని వెండితెర మీద మళ్లీ చూడలేమేమో..

    English summary
    Rishi Kapoor Death Anniversary: Bollywood Romantic hero Rishi Kapoor had passed away. The actor died of cancer on April 30 last year. In this tragic occassion, unforgettable romantic hero in film Inudstry career and personal details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X