RRR మూవీ నుంచి మరో లీక్: ఎన్టీఆర్‌తో రాజమౌళి సూపర్ ప్లాన్.. దానికి కూడా ముహూర్తం పెట్టేశారుగా!

RRR.. పేరుకే ఇది తెలుగు సినిమా.. కానీ దేశం మొత్తం దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనికి కారణం ఈ సినిమాను టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా పేరొందిన రాజమౌళి తెరకెక్కిస్తుండడం.. అలాగే, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమే. అందుకే ఈ సినిమాపై ప్రకటన సమయం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక, ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రం గురించి దర్శకధీరుడు వేసిన ప్లాన్ వేశాడని తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

విప్లవ వీరులుగా మారిన స్టార్ హీరోలు

విప్లవ వీరులుగా మారిన స్టార్ హీరోలు

స్వాతంత్ర్యానికి పూర్వం ప్రజల కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తీస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగానూ చేస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణం... ఆటంకాలే కారణం

సుదీర్ఘ ప్రయాణం... ఆటంకాలే కారణం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తైంది. కానీ చిత్రీకరణ మాత్రం ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. దీనికి కారణం ఈ సినిమాకు పలుమార్లు ఆటంకాలు ఎదురు కావడమే. మరీ ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది రెండు సార్లు నిలిపేయాల్సి వచ్చింది. ఫలితంగా చిత్రీకరణ మరింత ఆలస్యం అవుతూ వస్తోంది.

ఈ సారి అనుకున్న సమయానికే రెడీ

ఈ సారి అనుకున్న సమయానికే రెడీ

వాస్తవానికి RRR 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అయితే, ఇది వాయిదా పడుతుందని ప్రచారం జరిగినా అదే రోజు వస్తుందని అంటున్నారు.

కొత్త పోస్టర్‌తో శుభవార్త చెప్పిన టీమ్

కొత్త పోస్టర్‌తో శుభవార్త చెప్పిన టీమ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం కొంత మేర తగ్గడంతో RRR మూవీ షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఆ వెంటనే తాజా షెడ్యూల్‌ను పూర్తి చేశారు. అంతేకాదు, ఇటీవలే ఇద్దరు హీరోలు బైక్‌పై వస్తున్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైందని.. ఇద్దరు హీరోలు రెండు భాషలకు డబ్బింగ్ కూడా చెప్పేశారని ప్రకటించిందీ మూవీ యూనిట్.

యంగ్ టైగర్‌తో రాజమౌళి సూపర్ ప్లాన్

యంగ్ టైగర్‌తో రాజమౌళి సూపర్ ప్లాన్

RRR మూవీకి సంబంధించి రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒక పాట జూనియర్ ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ మీద చిత్రీకరించాల్సి ఉందట. దీని కోసం రాజమౌళి లొకేషన్స్ అన్నీ ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, దీనికోసం ఉక్రెయిన్‌ను ఎంపిక చేశాడని.. చిత్ర యూనిట్ ఆగస్టు ఫస్ట్ వీక్‌లో అక్కడకు వెళ్తుందని సమాచారం.

Recommended Video

Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
దానికి కూడా ముహూర్తం పెట్టేశారుగా

దానికి కూడా ముహూర్తం పెట్టేశారుగా

ఇక, మిగిలిన రెండో పాట సినిమాకే హైలైట్‌గా నిలిచేదిగా ఉంటుందని తెలిసింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్‌లు కలిసి ప్రజలను చైతన్య పరిచేలా దీన్ని డిజైన్ చేశారట. ఈ పాట కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో సెట్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఉక్రెయిన్ వెళ్లొచ్చిన వెంటనే ఇది ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ సాంగ్స్ అయిపోతే షూట్ పూర్తైనట్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X