For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రసాద్స్ ఐమాక్స్ వద్ద ఫీడ్ బ్యాక్... ‘శ్రీనివాస కళ్యాణం’పై ఊహించని కామెంట్స్!

  By Bojja Kumar
  |
  Srinivasa Kalyanam Movie Public Response

  నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' గురువారం గ్రాండ్‌గా విడుదలైనంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు దీనిపై ఒక్కో విధంగా స్పందించారు. ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ అని, పెళ్లి వేడుకను బాగా చూపించారని, సినిమా చూసిన వారు ఎవరూ విడపోరని, మన సాంప్రదాయాల గురించి బాగా చూపించారని ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం సినిమాను విమర్శించారు. సీరియల్‌లా ఉందని, ట్రెడిషన్‌ను చూపించడానికి మోడ్రనేజేషన్‌ను ఇన్సల్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.

  ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు

  ఫ్యామిలీతో ఎంజాయ్ చేయవచ్చు

  సినిమాలో ప్రకాష్ రాజ్‌ను డిఫరెంటుగా చూపించారు. శతమానం భవతిలో అతడి పాత్ర పల్లెటూరి వాతావరణం కావాలనుకుంటాడు. ఈ సినిమాలో ఆయన్ను ఒక రిచ్ మ్యాన్ గా చూపిస్తారు. అక్కడి నుండి తను పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు, ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా బావున్నాయి. సినిమా, టైటిల్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అంతా బావుంది. క్లైమాక్స్ అన్నింటికంటే బావుంది. పాటలు బావున్నాయి. ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చు.

   విడాకులు తీసుకునే వారు ఈ సినిమా చూండండి

  విడాకులు తీసుకునే వారు ఈ సినిమా చూండండి

  సినిమాలో పెళ్లి గురించి అద్భుతంగా చూపించారు. విడాకులు తీసుకోవాలనుకునే వారు ఈ సినిమా ఒకసారి చూడండి. కొందరు పిల్లలను కన్న తర్వాత కూడా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారు పిల్లలను కనకముందు, పెళ్లి చేసుకునే ముందే ఆలోచించండి. అలాంటి ఆలోచన ఉన్న వారు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అలాంటి వారిలో తప్పకుండా మార్పు వస్తుంది.

  వర్త్ టు వాచ్

  వర్త్ టు వాచ్

  బంధాలు, బాంధవ్యాల గురించి వివరిస్తూ సినిమాను బాగా ముందుకు తీసుకెళ్లారు. అనవసరమైన మెలోడ్రామా ఏమీ పెట్టకుండా కంప్లీట్ బ్యాలెన్డ్స్ గా నడిపించారు. డైలాగులు సింపుల్ గా ఎలాంటి మెలో డ్రామా లేకుండా పెట్టారు. వర్త్ టు వాచ్ మూవీ.

   పెళ్లిపై చిన్న చూపు ఉన్నవారు చూడాలి

  పెళ్లిపై చిన్న చూపు ఉన్నవారు చూడాలి

  మన విలువలు సాంప్రదాయాల గురించి గొప్పగా చెప్పారు. ఎవరైతే పెళ్లిళ్లు చేసుకోకూడదనుకుంటున్నారో అలాంటి వారు తప్పకుండా చూడాలి. పెళ్లి గురించి చాలా మందికి చిన్న అభిప్రాయం ఉంటుంది. వారంతా తప్పకుండా ఈ సినిమా చూడాలి.

  పెళ్లి ఒక సెలబ్రేషన్స్ లా చూపించారు

  పెళ్లి ఒక సెలబ్రేషన్స్ లా చూపించారు

  పెళ్లి అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వేడుక. అలాంటి వేడుకను చాలా బాగా చూపించారు. ఒక సెలబ్రేషన్ మూడ్లోకి తీసుకెళ్లారు.

   ఈ సినిమా చూసినవాడు ఎవరూ విడిపోరు

  ఈ సినిమా చూసినవాడు ఎవరూ విడిపోరు

  ఈ సినిమా తీసిన దిల్ రాజుకు, డైరెక్టర్‌కు, నటీనటులకు థాంక్స్... ఇది చాలా సంతోషకరమైన విషయం. మంచి సినిమా తీశారు. సినిమా అంటే ఇలా ఉండాలి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలాంటి మంచి సినిమాలు తీసేశారు. పాత సినిమాలు చాలా గొప్పగా ఉండేవి. చూడటానికి కూడా ముచ్చటగా ఉండేవి. పిల్లలకు మంచి, చెడు సినిమాల ద్వారా తెలిసేవి. ఇపుడు మొగుడు పెళ్లాలు హాయ్, బాయ్... కొట్టుకోవడం తప్ప ఏమీ ఉండటం లేదు. ఈ సినిమా చూసిన వాడు ఎవరూ విడిపోరు.

  టీవీ సీరియల్‌లా ఉంది

  టీవీ సీరియల్‌లా ఉంది

  టీవీ సీరియల్ మాదిరిగా అనిపించింది. నితిన్ ఏడుస్తూ ఉంటాడు. అక్కడక్కడ ఏదో సాంగ్స్ ఉన్నాయి. కొన్ని సీన్లు కన్విన్సింగ్ గా లేదు. హమ్ ఆఫ్ హై కౌన్ చూస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. అలాంటి రిచ్ నెస్ ఉంటే బావుండేది. ఇందులో అలాంటి ఫీల్ మిస్సయింది.

   ట్రెడిషన్‌ను చూపించడానికి మోడ్రనైజేషన్‌ను ఇన్సల్ట్ చేశారు

  ట్రెడిషన్‌ను చూపించడానికి మోడ్రనైజేషన్‌ను ఇన్సల్ట్ చేశారు

  ప్రకాష్ రాజ్‌ను సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మేన్‌లా చూపించారు కానీ, అతడిని నెగెటివ్‌గా చూపించడం, పని లేని వాళ్లను గొప్పగా చూపించడం వింతగా అనిపించింది. ఇపుడు ప్రొగ్రెసివ్ వరల్డ్ ఎటు వెళుతుందో అందరికీ తెలుసు... ట్రెడిషన్‌ను చూపించడానికి మోడ్రనైజేషన్‌ను ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది నాకు నచ్చలేదు.

  English summary
  Director Satish Vegesna's Telugu movie Srinivasa Kalyanam starring Nithiin, Raashi Khanna and Nandita Swetha, has received positive review and rating from audience.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X