SS Rajmouli's Friendship day Gift: క్రేజీగా RRR ప్రోమో సాంగ్ షూట్.. జక్కన్న హీరోలందరితో కళ్లు చెదిరేలా!
దర్శకుడు ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలో షూటింగు ముగించుకోబోతున్న ఈ చిత్రంపై జక్కన్న రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నారు. కొద్ది రోజుల క్రితం మేకింగ్ వీడియోతో హల్‌చల్ సృష్టించిన రాజమౌళి ఫ్రెండ్‌షిప్ డే రోజున అభిమానులకు కానుకను అందించేందుకు మరో భారీ ప్రయత్నానికి తెరలేపారు. రాజమౌళి చేస్తున్న భారీ ప్రయత్నం ఏమిటంటే..

హైదరాబాద్ చేరుకొన్న అలియాభట్
RRR మేకింగ్ వీడియోతో సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంపొందించిన రాజమౌళి మూవీ షూటింగ్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే రాంచరణ్, అలియాభట్‌పై పాటను చిత్రీకరించేందుకు సిద్దమయ్యాడు. ఈ పాట షూట్ కోసం ఆలియాభట్ మంగళవారం హైదరాబాద్‌కు చేరుకొన్నారు.

రాంచరణ్, ఆలియాభట్‌పై
RRR మూవీలో కీలకంగా మారిన పాటను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో రాంచరణ్, ఆలియాభట్‌పై చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం రాజమౌళి ప్రత్యేకంగా సెట్‌ను డిజైన్ చేశారు. మరో రెండు రోజులపాటు ఈ సినిమా పాటను చిత్రీకరిస్తారు అని తెలిసింది. ఈ పాట చిత్రీకరణ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది.

రాజమౌళి ఫ్రెండ్‌షిప్ డే కానుక
ఇదిలా ఉండగా, ఫ్రెండ్‌షిప్ డే రోజున అభిమానులకు భారీ కానుకను ఇవ్వనున్నారు. సినిమా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ప్రోమో సాంగ్‌ను షూట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రోమో సాంగ్ కోసం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేస్తున్నారు. ఈ పాటను త్వరలోనే పూర్తి చేసి ఫ్రెండ్‌షిప్ డే రోజున విడుదల చేయనున్నారు

ప్రభాస్, రవితేజ, నాని తదితరులతో
ఆగస్టు 1వ తేదీన జరుపుకొనే ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా రాజమౌళి అందించే కానుకలో ప్రత్యేకత ఏమిటంటే.. ఇప్పటి వరకు తన సినిమాలో పనిచేసిన హీరోలందర్నీ ఈ పాటలో భాగస్వామ్యం చేయబోతున్నట్టు సమాచారం. ఈ ప్రోమో సాంగ్‌లో రాంచరణ్, ఎన్టీఆర్‌తోపాటు ప్రభాస్, నితిన్, రవితేజ, సునీల్, నాని తదితరులు కనిపించబోతున్నారు. ఈ ప్రోమో పాట సినీ అభిమానులు, ప్రేక్షకులు థ్రిల్ కలిగించడం ఖాయం అని చెబుతున్నారు.
Recommended Video

కాలభైరవతో నోట ప్రోమో పాట
RRR మూవీ రిలీజ్‌కు ఉపకరించే విధంగా, అలాగే మరింత అంచనాలు పెంచే విధంగా ప్రోమో సాంగ్‌ను డిజైన్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రల మధ్య ఉండే స్నేహాన్ని ప్రతిబింబించేలా పాటను రూపొందించినట్టు సమాచారం. ఈ పాటను కాలభైరవ చేత పాడించినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లే విధంగా ప్రోమో పాట ఉంటుందని చెప్పుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











