twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా దెబ్బకు కిరాణం షాపు తెరిచిన దర్శకుడు.. లాక్‌డౌన్‌తో సినిమా కష్టాలు

    |

    కరోనావైరస్ వ్యాప్తి ప్రభావం, లాక్‌డౌన్ పరిస్థితులు దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమపై కోలుకోలేని దెబ్బ పడుతున్నది. నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రోజువారీ సినీ వేతన కార్మికుల జీవితాలు ఒక్కసారిగా తలకిందులైనంత పరిస్థితి కనిపిస్తున్నది. గత మూడు నెలలకుపైగా షూటింగులు, సినిమాల రిలీజ్‌లు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ దర్శకుడు కిరాణం షాపును పెట్టుకోవడం దక్షిణాది సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే..

    లాక్‌డౌన్‌తో కుటుంబ పోషణ కష్టంగా

    లాక్‌డౌన్‌తో కుటుంబ పోషణ కష్టంగా

    తమిళ సినిమా పరిశ్రమలో ఆనంద్ గత దశాబ్దకాలంగా చిన్న సినిమాలు రూపొందిస్తూ దర్శకుడిగా తన కెరీర్‌ను ముందుకు సాగిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను రూపొందిస్తున్న నానుమ్ పై ధాన్ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉండగా, మరో సినిమా తునింతు సీ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ధాంతో పరిస్థితి ఊహించలేని విధంగా మారింది. దాంతో కుటుంబ పోషణ కోసం కిరాణం షాపును తెరిచానని ఆయన వెల్లడించారు.

    వారం రోజుల తర్వాత నరకం మొదలైంది

    వారం రోజుల తర్వాత నరకం మొదలైంది

    లాక్‌డౌన్‌ గురించి దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ.. కరోనా పరిస్థితుల ప్రభావంతో జీవితాలు తారుమారవుతున్నాయి. ఎలాంటి పనిచేయలేని పరిస్థితి నెలకొని ఉంది. లాక్‌డౌన్‌లో ఒకవారం బాగానే, ప్రశాంతంగా గడిచిపోయింది. ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటే బద్దకం, ఏమి తోచని పరిస్థితి ఎదురైంది. దాంతో నిత్యావసర వస్తువుల డిమాండ్‌ను గమనించి కిరాణం షాపును తెరిచాను అని ఆనంద్ తెలిపారు.

    నాకు షాపు నడిపిన అనుభవం

    నాకు షాపు నడిపిన అనుభవం

    కిరాణం షాపు ఓపెన్ చేయడంపై ఆనంద్ స్పందిస్తూ.. నాకు గతంలో ఇలాంటి షాపులు నడిపిన అనుభవం లేదు. తక్కువ మొత్తంతో చిన్నపాటి షాపును ఓ కమర్షియల్ అడ్డాలో తెరిచాను. షాపును కిరాయికి ఇచ్చిన వ్యక్తి, సినిమా పరిశ్రమలోని నా మిత్రులు నాకు సహకారం అందిస్తున్నారు. ఈ కిరాణ షాపు ద్వారా వచ్చే కొంత ఆదాయాన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నాను అని దర్శకుడు ఆనంద్ పేర్కొన్నారు.

    నా కిరాణం స్టోరుకు మంచి ఆదరణ

    నా కిరాణం స్టోరుకు మంచి ఆదరణ


    కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదనే విషయం అర్ధం కావడంతో జూన్‌లో కిరాణం షాపు తెరిచాను. ప్రస్తుతం బాగానే వ్యాపారం నడుస్తున్నది. కిరాణం వస్తువుల రేట్లు, డిస్కౌంట్ వివరాలను షాపు బయట పెట్టాను. వినియోగదారులు రేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో భారీగా వ్యాపారం జరుగుతున్నది. వాళ్లు వీళ్లు చెప్పుకోవడం ద్వారా షాపు గురించి చాలా మందికి తెలిసింది అని దర్శకుడు ఆనంద్ తెలిపారు.

    స్నేహితులు, సన్నిహితుల సహకారంతో

    స్నేహితులు, సన్నిహితుల సహకారంతో

    నేను తెరిచిన కిరాణం షాపుకు స్నేహితులు, రెగ్యులర్ కస్టమర్స్ వల్ల మంచి పబ్లిసిటీ లభించింది. నాణ్యమైన వస్తువులను అమ్మడంతో వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాతో పాటు షాపులో 5 గురు వ్యక్తులు పనిచేస్తున్నారు. ఊహించని విధంగా కిరాణం షాపుకు మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉంది అని ఆనంద్ వెల్లడించారు.

    Recommended Video

    Director Shankar Views On Releasing Movies Directly In OTT
    ఐదు సినిమాలు.. మరో రెండు సినిమా రీలీజ్‌కు

    ఐదు సినిమాలు.. మరో రెండు సినిమా రీలీజ్‌కు

    తమిళ సిని పరిశ్రమలో ఇప్పటి వరకు ఐదు చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించాను. నానుమ్ పై ధాన్, తునింతు సీ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల్లో ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాను. అయితే చిన్న నిర్మాతలకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ అందుబాటులో లేవు, సహకారం లభించడం లేదు అని అన్నారు. అలాగే సినిమాలు కొనడానికి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు అని నిర్మాత ఆనంద్ అన్నారు.

    English summary
    Tamil Director Anand Turns Grocery shop over due to Corona Lockdown. Naanum Pei Dhaan and Thuninthu Sei movies are ready to release but, Lockdown makes hardle for the release. Director Anand had opened a provision store to earn for his family during the coronavirus pandemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X