twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 ఏళ్ల సినీ ప్రస్థానం.. టాలీవుడ్ టార్చ్ బేరర్‌గా దర్శకరత్న దాసరి.. గిన్నీస్ రికార్డు రికార్డుతో

    |

    వ్యక్తిగా మొదలై శక్తిగా మారారు దాసరి నారాయణరావు. తాత మనవడు అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన సుదీర్ఘ కెరియర్లో బాబు 150 కి పైగా సినిమాలు తెరకెక్కించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించారు. ఒకరకంగా ఆయనకు చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదు.. కుటుంబ కథా చిత్రమైనా, ఘాటు సోషల్ మెసేజ్ ఇచ్చి సమాజాన్ని మేలుకొలిపే సినిమాలైనా, చెంపపెట్టులా సాగే రాజకీయ సినిమా అయినా తీయడంలో తనకు తానే సాటి. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగు చిత్ర సీమకు పెద్దన్నలా, ఒక అండగా వ్యవహరించిన దాసరి 74 వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమ సహా తెలుగు వారంతా గుర్తు చేసుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం ఒక సారి పరిశీలిస్తే

    ఏడో తరగతిలోనే

    ఏడో తరగతిలోనే


    మే 4 1947 న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో దాసరి జన్మించారు. ఆ రోజుల్లో దాసరి కుటుంబం పొగాకు వ్యాపారం చేసేవారు. ఒకసారి దీపావళి సమయంలో పొగాకు గోడౌన్‌ తగలబడిపోయిన కారణంగా ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు. అయినా సరే చిన్ననాటి నుంచే దాసరికి నాటకాలపైనా, సాహిత్యంపైనా ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టంతోనే దాసరి ఏడో తరగతిలోనే 'నేనూ.. నా స్కూల్' పేరుతో 15 నిమిషాల నాటిక సిద్ధం చేసి తానే నటించారు. అలా 1962లో ప్రణాళిక ప్రచారంపై హైదరాబాదులో జరిగిన నాటక పోటీలో రాష్ట్ర ఉత్తమ నటుడిగా బహుమతి పొందారు.

    గిన్నిస్ బుక్ దాకా

    గిన్నిస్ బుక్ దాకా


    ఇక దర్శకుడిగా 1973లో మొట్టమొదటి సారి దాసరి 'తాత మనవడు' సినిమా తీశారు. చాలా లోతైన సబ్జెక్టుతో ఆ సినిమా రూపొందించి శభాష్‌ అనిపించుకున్నారు. ఆ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం అత్యధిక సినిమాలు దర్శకత్వం చేసి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కే దాకా సాగింది. దాసరి.. కుటుంబం ఉన్న నడివయసు వ్యక్తితో మేఘసందేశం లాంటి ప్రేమకథ తీయడం ఆయన ధైర్య సాహసాలు ఎలాంటివో చాటి చెప్పింది.

    ఏ జానర్ను వదలకుండా

    ఏ జానర్ను వదలకుండా

    ఫ్యామిలీ ఎంటర్టైనర్ లుగా తెరకెక్కిన అమ్మ రాజీనామా, సూరిగాడు, భగ్న ప్రేమ కథలు ప్రేమాభిషేకం, మజ్ను, స్వయంవరం లాంటి సినిమాలు మాత్రమే కాదు. వివక్షను ప్రశ్నించే బలిపీఠం, అవినీతి మీద ఎక్కు పెట్టిన బాణాల్లా తెరకెక్కిన ఎమ్మెల్యే ఏడుకొండలు, దొరల పెత్తనం మీద ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు ఆయనలో ప్రతిభను చాటిచెప్పాయి. ఇవి కాక ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కారణమైన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు, మనుషులంతా ఒక్కటే లాంటి సినిమాలు సైతం దాసరి గారి దర్శకత్వంలో వచ్చినవే.

    అందరికీ పెద్దగా

    అందరికీ పెద్దగా

    నిజానికి సినిమా పరిశ్రమలో ఏ చిన్న గొడవ జరిగినా ఆయన తలుపు తట్టే వాళ్లు. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా ఆయన ఇంటి తలుపులు తీసే ఉంచేవారని చెబుతూ ఉంటారు. ఇక దాస‌రి నారాయ‌ణ‌రావు చిన్నా పెద్ద తేడా లేకుండా అంద‌రి సినిమాల‌కు అండగా నిలబడే వారు. ఉదాహరణకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్టే రాజ్ త‌రుణ్ సినిమా ఫంక్షన్కు కూడా వ‌చ్చేవారు.

    మొదటి చివరి సినిమాలు అవే

    మొదటి చివరి సినిమాలు అవే


    ఇక దాసరి చివరిగా నటించిన సినిమా మంచు విష్ణు నటించిన ఎర్రబస్సు. ఈ సినిమాలో దాసరి ఓ ప్రత్యేకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తన మొదటి సినిమా తాత మనవడు మధ్య జరిగిన మానసిక సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కింది. మానవ సంబంధాలను ఎత్తిచూపుతూ ఆ సినిమా సాగగా ఆయన నటించిన చివరి సినిమా ఎర్రబస్సులో మంచు విష్ణుకు తాత పాత్రలో నటించారు. యాదృచ్చికమో కాకతాళీయమో గానీ.. ఆయన మొదటి, చివరి సినిమాలు తాతా మనవడు సంబంధాలపై రూపొందడం గమనార్హం.

    బహుముఖ ప్రజ్ఞాశాలి

    బహుముఖ ప్రజ్ఞాశాలి

    40 ఏళ్లకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో 151 చిత్రాలకు దర్శకత్వం, 53 సినిమాల నిర్మాణం.. 250 చిత్రాలకు సంభాషణలు అందించారు దాసరి నారాయణరావు. జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పబ్లిషర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా...డిస్ట్రిబ్యూటర్ గా మారారు. ఇక దర్శకుడిగా మారిన ఆయన నటుడిగా సైతం అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక కాంగ్రెస్ లో చేరిన ఆయన కేంద్ర మంత్రిగా సైతం భారత దేశానికి సేవలు అందించారు. ఆయనకు 18000కి పైగా ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

    Recommended Video

    Rajinikanth కి Dada Saheb Falke Award | 25 ఏళ్ల తర్వాత రికార్డు!!
    గౌరవం ఇప్పటికైనా ఇవ్వండి

    గౌరవం ఇప్పటికైనా ఇవ్వండి


    ఇక దాసరి జయంతి సందర్భంగా చిరంజీవి ఆయనను గుర్తు చేసుకున్నారు. ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదన్న చిరంజీవి పద్మ పురస్కారంతో ఆయన్ని గౌరవించాలని కోరారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా స్మృత్యంజలి. విజయాలలో ఒక దానికి మించిన మరో చిత్రాలని తన అపూర్వ దర్శకత్వ ప్రతిభతో మలచడమే కాదు, నిరంతరం చిత్ర పరిశ్రమలోని సమస్యలని పరిష్కారానికి ఆయన చేసిన కృషి, ఎప్పటికీ మార్గదర్శకమే. దాసరికి ఇప్పటికీ తగిన ప్రభుత్వ గుర్తింపు రాకపోవడం ఒక తీరని లోటు. ఆయనకు పోస్త్యుమస్‌ గా నైనా విశిష్టమైన పద్మ పురస్కారం దక్కితే అది మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకి దక్కే గౌరవమవుతుంది అని ఆయన ట్వీట్‌ చేశారు. దీనికి సినీ వర్గాల నుంచి, అభిమానుల నుంచి మద్దతు పెరుగుతుంది.

    English summary
    Tollywood top filmmaker Dasari Narayana Rao was one of the iconic directors. In his long career, he had made over 150 films. Apart from direction, Dasari was also a good actor, screenwriter, and lyric writer. Remembering the legendary filmmaker on the occasion of his birth anniversary. Megastar Chiranjeevi came up with a demand that Dasari Narayana Rao should be awarded Padma Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X