For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెండేళ్ల తరువాత ఓ ట్వీట్.. అది కూడా అన్యాయానికి వ్యతిరేకంగా.. ఆ డైరెక్టర్ రియల్ హీరో

  |

  తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో నేరుగా ఒక్క చిత్రం తీయకపోయినా ఆయన పేరు మాత్రమే మార్మోగిపోయింది. కేవలం దక్షిణాదినే కాదు..ఉత్తరాదినా వెట్రిమారన్ క్రేజ్ వేరే లెవెల్‌లో ఉంటుంది. సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కించిన వడచెన్నై, అసురన్ చిత్రాలతో వెట్రిమారన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. విసరణై (తెలుగులో విచారణ) సినిమాతో తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేశాడు. తమిళ నాడు ప్రస్తుతం రగులుతున్న ఆగ్రహ జ్వాలల గురించి అందరికీ తెలిసిందే. జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసుల జులుంకు వ్యతిరేకంగా తమిళ సమాజం గొంతెత్తుతోంది. తాజాగా వెట్రిమారన్ సైతం తనదైన శైలిలో స్పందించాడు.

  తండ్రీ కొడుకులపై దారుణం..

  తండ్రీ కొడుకులపై దారుణం..

  తూత్తుకుడిలో జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. లాక్ డౌన్‌లో తమ మొబైల్ షాపును అనుమతించిన సమయం కంటే కాసేపు ఎక్కువగా తెరిచి ఉంచినందుకు లాకప్‌లో వేసి చిత్రవదలు పెట్టారు. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో తండ్రీకొడుకులు మరణించారు.

  గొంతెత్తిన సమాజం..

  గొంతెత్తిన సమాజం..

  పోలీసుల ఆగడాలపై తమిళ సమాజం గొంతెత్తింది. సోషల్ మీడియాలో ఈ ఘటనను వైరల్ చేసి దేశమంతా స్పందించేలా చేశారు. జయరాజ్, ఫినిక్స్‌లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమిళ స్టార్ హీరోలు సైతం ఈ ఘటనపై ఫైర్ అయ్యారు. ఇందుకు కారణమైన పోలీసులను వదిలిపెట్టకూడదని, తగిన శిక్ష విధించాలని కోరారు.

  కేసులో పురోగతి..

  కేసులో పురోగతి..

  జయరాజ్, ఫినిక్స్ ఘటనపై స్వయంగా మద్రాస్ హైకోర్టు స్పందించింది. వెంటనే తగిన చర్యలు తీసుకోండని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా..మరో ఇద్దరిని ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే అది మాత్రమే చాలదని ప్రజలంతా రోడ్లపైకి వచ్చారు.

  సీసీటీవీ పుటేజ్..

  సీసీటీవీ పుటేజ్..

  జయరాజ్, ఫినిక్స్ ఘటన సాధారణమైంది కాదని ప్రత్యేకంగా విచారించాలని మద్రాస్ ధర్మాసనం నిర్ణయించింది. నాటి ఘటనకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌తో పాటు మూడు పేజీల రిపోర్ట్ కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ మహిళా పోలీసాఫీసర్ ప్రత్యక్ష సాక్షిగా ఉండేందుకు ముందుకు వచ్చింది.

  రెండేళ్ల తరువాత ట్వీట్..

  రెండేళ్ల తరువాత ట్వీట్..

  రెండేళ్ల తరువాత వెట్రిమారన్ ఈ అంశంపై ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉండేందుకు ముందుకు వచ్చిన ఆఫీసర్ రేవతి, నిజాయితీగా పని చేస్తోన్న జడ్జ్‌లు ప్రకాష్, పుహళేంది, మెజిస్ట్రేట్ భారతిదాసన్ వీరంతా మాకు నమ్మకాన్ని కలిగించారని, తామంతా మీ వెంటే ఉంటామని పేర్కొన్నాడు.

  రియల్ హీరో..

  రియల్ హీరో..

  రెండేళ్ల తరువాత ఇలాంటి అంశంపై ట్వీట్ చేయడం, అది కూడా ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా పేర్కొనడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు విసరణై సినిమాలో జరిగినట్టు ఉందని గుర్తు చేసుకుంటున్నారు. వెట్రిమారన్ రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

  English summary
  Vetrimaaran Tweet After Two Years On jeyaraj And Fenix. He says that Honourable judges P. N. Prakash, P. Pugazhendhi, magistrate Bharathidasan, courageous Revathi, you’ve given us hope. We stand by you.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X