Just In
- 21 min ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 26 min ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- 32 min ago
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
- 42 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
Don't Miss!
- News
షాకింగ్: క్షీణించిన శశికళ ఆరోగ్యం -విషమంగా వెంటిలేటర్‌పై చికిత్స -మణిపాల్‌కు తరలింపు
- Sports
ఐపీఎల్లో సురేశ్ రైనా సంపాదన రూ.100 కోట్లు.. నాలుగో ఆటగాడిగా రికార్డు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ.. అందులో పేరు చూసి అవాక్కవుతున్న రౌడీ ఫ్యాన్స్
తక్కువ సినిమాలతోనే ఎక్కువ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోల్లో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసిన ఈ యంగ్‌స్టర్.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో విజయ్ దేవరకొండ అందరికీ సుపరిచితుడు అయ్యాడు. ఇక, ఆ తర్వాత వచ్చిన 'అర్జున్ రెడ్డి' మూవీతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా గణనీయంగా వృద్ధి చెందింది.

అది మాత్రం బాగా నిరాశకు గురి చేసింది
విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి' ఎంతో పాపులారిటీ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం' కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు అతడికి మంచి పేరును తెచ్చి పెట్టింది. అదే సమయంలో విజయ్ మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే వచ్చిన ‘డియర్ కామ్రేడ్' మాత్రం అతడిని బాగా నిరాశకు గురి చేసింది.

నలుగురు హీరోయిన్లను లవ్ చేస్తున్నాడు
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అతడు నలుగురు అమ్మాయిలను ప్రేమించే వ్యక్తిగా కనిపించనున్నాడు. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాలుగు పాత్రలా.. నాలుగు వేరియేషన్లా.?
ఇటీవల విడుదల చేసిన హీరోయిన్లకు సంబంధించిన పోస్టర్లలో ఈ సినిమాలో విజయ్ నాలుగు గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. దీంతో అతడు నాలుగు పాత్రలు చేస్తున్నాడా.? లేక.. నాలుగు వేరియేషన్లలో కనిపిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
పేరు మార్చుకున్న విజయ్ దేవరకొండ
‘వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా టీజర్ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ మొత్తంలో ఓ ఆసక్తికర న్యూస్ తెరపైకి వచ్చింది. అదే.. ఇందులో విజయ్ తన పేరును మార్చుకోవడం. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో ‘విజయ్ దేవరకొండ' అని పేరు వేయించున్న ఈ యంగ్ హీరో.. ఇందులో మాత్రం ‘దేవరకొండ విజయ్ సాయి' అని మార్చుకున్నాడు.

అంచనాలు పెరిగాయి.. అవాక్కవుతున్నారు
ఈ టీజర్‌లో విజయ్ నాలుగు పాత్రల్లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా లవ్ ఫెయిల్ అయిన యువకుడిగా అద్భుతమైన నటనను కనబరుస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఇందులో విజయ్ పేరు మార్చుకోవడంతో ఈ రౌడీ హీరో ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.