twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతలను ఎన్టీఆర్ అలా గౌరవించేవారట.. నాటి సంఘటనను గుర్తు చేసుకున్న వైజయంతీ మూవీస్

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తెలుగు జాతిని గర్వించేలా చేసి, తెలుగు ప్రజలకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడే. అందుకే నిన్న ఆయన జయంతి వేడుకలు అంత ఘనంగా జరిగాయి. టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ జయంతిపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా సనీ ప్రముఖులంతా ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌పై ట్వీట్ల వర్షం కురిసింది.

    Recommended Video

    Vyjayanthi Movies Recalls SR NTR Humble Nature Towards Producers
    వేడుకలకు దూరంగా..

    వేడుకలకు దూరంగా..

    ప్రతీ ఏడాది ఎన్టీఆర్ జయంతి నాడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కూడా ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో.. తాను ఈ ఏడాది ఘాట్‌ను దర్శించుకోవడం లేదని తెలిపాడు. ఈ మేరకు తాతపై ఉన్న ప్రేమను ట్వీట్ రూపంలో ప్రకటించాడు.

    సెలెబ్రిటీల ట్వీట్స్ వైరల్..

    సెలెబ్రిటీల ట్వీట్స్ వైరల్..

    ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టాలీవుడ్ మొత్తం సోషల్ మీడియాలో స్పందించింది. మెగాస్టార్ చిరంజీవి దగ్గరి నుంచి యువ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, హీరోయిన్లు, సినిమా పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.

     వైజయంతీ సంస్థ ట్వీట్..

    వైజయంతీ సంస్థ ట్వీట్..

    ఎన్టీఆర్ చేతుల మీదుగా స్థాపించబడిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్. ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమా ఎదురులేని మనిషి చిత్రాన్ని తెరక్కించింది వైజయంతీ మూవీస్. ఆ సమయంలో అశ్వనీదత్ వయసు కేవలం 24. అయితే నాడు నిర్మాతలు ఏ విధంగా గౌరవించేవారో, ఎంతటి సముచిత స్థానాన్ని ఎన్టీఆర్ ఇచ్చేవారో వైజయంతీ సంస్థ చెప్పుకొచ్చింది.

    లేచి నిలబడిన ఎన్టీఆర్..

    లేచి నిలబడిన ఎన్టీఆర్..

    ఒక రోజు అశ్వనీదత్ సెట్‌కు వస్తే.. కూర్చున్న ఎన్టీఆర్ నిలబడి మరీ ఆహ్వానం చెప్పారట. దత్తు గారి గుండె ఝల్లుమందట. ‘అన్నగారు నేను వస్తే మీరు లేచి నిల్చోవడం ఏంటి? 'అని సిగ్గుతో ముడుచుకుపోయారట అశ్వనీదత్. ‘ఈ సినిమాకి నిర్మాతవి అందరికీ పని కల్పించి అన్నం పెట్టేవాడివి.. నిన్ను నేనే గౌరవించకపోతే ఇతరులు ఏం పట్టించకుంటారు'అని ఎన్టీఆర్ తిరిగి ప్రశ్నించారట.

     నేటి పరిస్థితి భిన్నం..

    నేటి పరిస్థితి భిన్నం..


    అయితే నేడు మాత్రం పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టే వాడే అని అనుకుంటున్నారు. నిర్మాత పరిస్థితి మరీ దయనీయంగా మారింది. కొందరు నిర్మాతలు హీరో, దర్శకుల చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారు. మళ్లీ నిర్మాతలు నాటి వైభవాన్ని చూడగలరో లేదో.

    English summary
    Vyjayanthi Movies Recalls NTR Humble Nature On His Birth Anniversary. Vyjayanthi Movies Showered Their Love On NTR On His Jayanthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X