twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్? మీకు బాధ్యత లేదా?: యాంకర్ అనసూయ

    |

    ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నడి రోడ్డు మీద పట్టపగలు రెండు మూడు హత్యలు జరిగాయి. వందల మంది చూస్తుండగా కత్తులతో పొడిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘోరాలను ఎవరూ ఆపే ధైర్యం చేయకపోగా... చూస్తూ వెళ్లిపోయారు. దీంతో పాటు ఇటీవల జరుగుతున్న కొన్ని నేరాలు, నీటి సమస్య లాంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

    ఇలాంటివి జరిగినపుడు పోలీసులు, ప్రభుత్వాల చేతకానితనం అంటూ దుమ్మెత్తిపోయడం సర్వసాధారణంగా చూస్తూనే ఉన్నాం. చెన్నైలో నీటికి కటకట ఏర్పడిన నేపథ్యంలో... భవిష్యత్తులో హైదరాబాద్‌కు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నీటిని సేవ్ చేయాలని అనసూయ ఒక ట్వీట్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు ఇది ప్రభుత్వాలు చూసుకోవాల్సిన బాధ్యత అంటూ నెగెటివ్‌గా స్పందించడంతో ఈ హాట్ యాంకర్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

    వాళ్లను వీళ్లను బ్లేమ్ చేయడం ఎందుకు?

    వాళ్లను వీళ్లను బ్లేమ్ చేయడం ఎందుకు?

    ప్రతి విషయానికి మనం ఇతరులను బ్లేమ్ చేయడం ఎందుకు? వాటర్ సేవ్ చేయాలి అంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తాం, అమ్మాయిలకు సేఫ్టీ లేదు అంటే పోలీసులను బ్లేమ్ చేస్తాం. అన్నింటికీ వాళ్లను, వీళ్లను బ్లేమ్ చేస్తున్నాం. పౌరులుగా మన వనరులను, మన ఫ్యామిలీలను కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు లేదా? అంటూ అనసూయ ట్వీట్ చేశారు.

    అలా చేయడం ఎంత వరకు కరెక్ట్?

    అలా చేయడం ఎంత వరకు కరెక్ట్?

    మన ముందు, మన చుట్టుపక్కల ఏదైనా చెడు(తప్పు) జరిగితే మనం ఆపే ప్రయత్నం చేయకుండా... ఇక్కడో స్టేషన్లో కూర్చున్న పోలీసులను, ఆఫీసులో ఉన్న అధికారులను, రూలింగులో ఉన్న ప్రభుత్వాలను అనడం ఎంత వరకు కరెక్టో మీరే చెప్పండి? అంటూ ప్రశ్నించారు.

    ప్రతి ఒక్కరూ అలా ఆలోచించాలి

    ప్రతి ఒక్కరూ అలా ఆలోచించాలి

    వాళ్లు చేయగలిగింది చేయగలిగినంత చేస్తారు అనే నమ్మకంతో ఉంటూనే మన ముందు ఏదైనా తప్పు జరిగితే అడ్డుకోవాలి. నేను చేసే, చేయబోయే, చేయాలనుకునే ఫలానా పని చేయడం ఒక మనిషిగా ఎంత వరకూ కరెక్ట్‌ అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి... అని అనసూయ సూచించారు.

    అభిమానుల మద్దతు

    అభిమానుల మద్దతు

    అనసూయ చేసిన ఈ ట్వీట్‌పై అభిమానుల నుంచి మంచి స్పంద వస్తోంది. అనసూయ చెప్పింది వందశాతం నిజం అంటూ... పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమ పద్దతి మార్చుకోకుండా అనసూయను తప్పుబట్టే ప్రయత్నం చేశారు.

    English summary
    "Wake up wake and Save Water. Why should we blame everything on somebody else. Isn’t it every individual’s primary duty and responsibility to save our resources and families??" Anchor Anasuya tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X