twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళితో సినిమా చేస్తే ఫ్లాప్ తప్పదా.. ఆ ట్రెండ్‌ను సాహో తిరగరాస్తుందా?

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి అనే సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా రాజమౌళి పేరు చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమానే కాదు.. అంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నదే. అందుకే ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు. వాస్తవానికి రాజమౌళి సినిమాతో ఎంతో మంది స్టార్లుగా ఎదిగిపోయారు కూడా. అయితే, ఆయనతో సినిమా చేస్తే నష్టాలు కూడా ఉంటాయన్న టాక్ తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటా టాక్..? ఇప్పుడెందుకు ఇది బయటకు వచ్చింది..? దీని వెనుక అసలు కథ ఏమిటి..?

    అన్నీ సూపర్ హిట్లే

    అన్నీ సూపర్ హిట్లే

    రాజమౌళి ఇప్పటి వరకు 11 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అన్ని సినిమాలూ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో మూడేసి సినిమాలు, రామ్ చరణ్, రవితేజ, సునీల్, నితిన్‌, నానిలతో ఒక్కో సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గానే పేరు తెచ్చుకున్న రాజమౌళి.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

    జూనియర్ ఎన్టీఆర్‌తో మొదలు

    జూనియర్ ఎన్టీఆర్‌తో మొదలు

    దర్శకధీరుడు రాజమౌళి.. రాఘవేంద్ర రావు శిష్యుడిగా ‘స్టూడెంట్ నెం.1' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తోనే ‘సింహాద్రి' అనే సినిమాను చేశాడు. ఇక, వీళ్ల కాంబినేషన్‌లో ‘యమదొంగ'తో హ్యాట్రిక్ హిట్స్ నమోదయ్యాయి. ఈ మూడు చిత్రాలూ తారక్‌ను స్టార్ హీరోగా మార్చాయి. అదే సమయంలో ఈ సినిమాల తర్వాత అతడు చేసే ప్రతి సినిమా డిజాస్టర్ అయింది. స్టూడెంట్ నెం.1 తర్వాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రావాలా, యమదొంగ తర్వాత కంత్రీ సినిమాలు నిరాశకు గురి చేశాయి.

    రామ్ చరణ్‌కు భారీ స్థాయిలో...

    రామ్ చరణ్‌కు భారీ స్థాయిలో...

    రాజమౌళి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర' ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న రికార్డలన్నీ బద్దలు కొట్టడంతో పాటు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో చెర్రీ ఒక్కసారిగా స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత తీసిన ‘ఆరెంజ్' మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి.

    రవితేజ, సునీల్, నితిన్‌లకు కూడా ఇలాగే

    రవితేజ, సునీల్, నితిన్‌లకు కూడా ఇలాగే

    రాజమౌళి దర్శకత్వంలో రవితేజ (విక్రమార్కుడు), సునీల్ (మర్యాద రామన్న), నితిన్ (సై)లు కూడా నటించారు. ఈ ముగ్గురికీ విజయాలు దక్కాయి. అయితే, ఆ తర్వాత వీళ్లు చేసిన సినిమాలు ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్‌ రూపంలో రవితేజకు భారీ పరాజయం దక్కింది. ఇక, సై తర్వాత నితిన్‌ అల్లరి బుల్లోడు అనే సినిమా చేశాడు. ఇది కూడా నిరాశనే మిగిల్చింది. మర్యాద రామన్న తర్వాత సునీల్.. కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే సినిమా చేశాడు. ఇది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా తెలీదు.

    సాహోకు కూడా అదే సెంటిమెంట్ వర్తిస్తుందా.?

    సాహోకు కూడా అదే సెంటిమెంట్ వర్తిస్తుందా.?

    యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో రాజమౌళి మూడు సినిమాలు చేశారు. అందులో ఒకటి ఛత్రపతి కాగా, మిగిలిన రెండు బాహుబలి భాగాలు. వీటిలో ఛత్రపతి తర్వాత అతడికి పౌర్ణమి రూపంలో భారీ ఫ్లాప్ వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా సాహో కావడంతో దీనికి కూడా ఆ సెంటిమెంట్ వర్తిస్తుందా అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి. దీంతో చాలా మంది భయపడిపోతున్నారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని ఫలితం గురించి తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడక తప్పదు.

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి ‘RRR' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

    English summary
    Koduri Srisaila Sri Rajamouli, professionally known as S. S. Rajamouli is an Indian film director, and screenwriter known for his works primarily in Telugu cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X