twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేచింది మహిళా లోకం.. హీరోల దూకుడుకు అడ్డుకట్ట.. కోట్లు కుమ్మేస్తున్న బ్యూటీలు..

    |

    వినూత్న, విభిన్నమైన చిత్రాలకు ఆదరణ పెరుగుతున్నది. కథ బాగుంటే.. పెద్ద హీరో చిత్రమా? లేదా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమా అనే విషయాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదునే విషయం తాజాగా విడుదలైన చిత్రాలు నిరూపించాయి. ప్రధానంగా మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. తెలుగులో మహానటి, భాగమతి, తమిళంలో కాట్రిన్ మోజీ, ఇమైక్క నోడిగల్, కొలమాను కోకిల (కో.. కో.. కోకిల) చిత్రాలకు ప్రేక్షకుల ప్రశంసలతోపాటు మంచి వసూళ్లు కూడా రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. మహిళ నేపథ్యం ఉన్న చిత్రాల సినీ పరిశ్రమ ట్రెండ్‌ను, ఇమేజ్ మారుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

    జ్యోతిక రీ ఎంట్రీ అదిరింది

    జ్యోతిక రీ ఎంట్రీ అదిరింది

    ప్రముఖ నటి జ్యోతిక నటించిన తాజా తమిళ చిత్రం కాట్రిన్ మోజి అనే చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. హిందీలో విద్యాబాలన్ నటించిన తుమ్హారీ సులు అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.4.40 కోట్లు రాబట్టడం గమనార్హం. పెళ్లి తర్వాత మళ్లీ కోలీవుడ్‌లోకి వచ్చిన జ్యోతిక నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. విజయ్ నటించిన సర్కార్ సినిమాతో పోటి పడుతూ ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తున్నది.

    నయనతార సక్సెస్ జోరు

    నయనతార సక్సెస్ జోరు

    ఇక నయనతార వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇమైక్క నాడిగల్, కొలమావు కోకిల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించాయి. ఇమైక్క నాడిగల్ చిత్రం రూ.20 కోట్లు, కొలమావు కోకిల చిత్రం రూ.30 కోట్లు వసూలు చేశాయి.

     బాక్సాఫీస్‌పై అనుష్క పంజా

    బాక్సాఫీస్‌పై అనుష్క పంజా

    ఇక తెలుగులో మహిళ ప్రాధాన్యం ఉన్న సినిమాల జోరు కొనసాగుతున్నే ఉంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క నటించిన భాగమతి చిత్రం బ్రహ్మండమైన సక్సెస్‌ను అందుకొన్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.67.2 కోట్ల మేర కలెక్షన్లను సాధించింది.

     ప్రేక్షకులు ఆకట్టుకొన్న మహానటి

    ప్రేక్షకులు ఆకట్టుకొన్న మహానటి

    ఇక ఆ తర్వాత వచ్చిన సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన మహానటి చిత్రంపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తీ సురేష్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఈ చిత్రం రూ.83 కోట్ల వసూళ్లను రాబట్టింది.

    హిందీలో కూడా ఇదే ట్రెండ్

    హిందీలో కూడా ఇదే ట్రెండ్

    హిందీలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. స్త్రీ, తుమ్హారి సులు లాంటి చిత్రాలు భారీ విజయాలను సాధిస్తున్నాయి. అగ్రహీరోలకు ధీటుగా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వసూళ్లను సాధించడం గమనార్హం.

    హీరో డామినేషన్ ఉన్న రంగంలో

    హీరో డామినేషన్ ఉన్న రంగంలో

    హీరో డామినేషన్ ఉన్న చిత్ర పరిశ్రమలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆదరణ పెరగడం శుభపరిణామం అని మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. హిందీ, తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతీ పరిశ్రమలో కొత్త ఆలోచనలకు, కథా ఆవిష్కరణలకు మంచి ఆదరణ లభిస్తున్నది. ప్రేక్షకులను మెప్పించడానికి దర్శకులు కొత్త స్క్రిప్టులపై ఆలోచనలను పెడుతున్నారు. విలన్లుగా మహిళలను పెట్టి హిట్లు కొడుతున్నారు. ఇది అన్ని పరిశ్రమలకు మంచిది అని నాగ అశ్విన్ పేర్కొన్నారు.

    English summary
    film industry is a certifiable growing trend in the more male-dominated Tamil and Telugu movie industries. Women are not just headlining unusual subjects but guaranteeing box office returns as well. Mahanati, Bhaagamathie, Kaatrin Mozhi, Tumhari Sulu, Imaikkaa Nodigal, Kolamavu Kokila proved their stregnth in film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X