»   »  క్లైమాక్స్ షూటింగ్ ఓ పీడకల

క్లైమాక్స్ షూటింగ్ ఓ పీడకల

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: షూటింగ్ పదిమంది ఆర్టిస్ట్ లను ఒకేసారి హ్యాండిల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాహుబలిలాంటి చిత్రాలు అందుకే లేటవుతూంటాయి. ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్ట్ లను మేకప్ చేసి, రెడీ చేసి షూట్ చేయటం అంటే మాటలుకాదు అంటూంటారు దర్శకులు. అలాంటిది ఏకంగా 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో క్లైమాక్స్ అంటే గ్రేటే కదా. అలాంటిది రీసెంట్ గా తమిళ చిత్ర పరిశ్రమలో జరిగింది.

శక్తి సౌందరరాజన్‌ దర్శకత్వంలో జయం రవి, లక్ష్మీమేనన్‌ జంటగా నటించిన ‘మిరుదన్‌' ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. జాంబీ బాణీలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ చిత్రసీమకు పూర్తిగా విభిన్నమైనది. క్లైమాక్స్‌ కోసం సుమారు 500 మంది సహాయ నటులతో షూటింగ్ జరిపారు.

500 junior artists as zombies for Miruthan's climax ..

రాత్రిపూట ప్రారంభించి తెల్లవారుజాము వరకు ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూనే ఉన్నారని, ఇలాంటివి మరికొన్ని ఈ హైలెట్‌గా నిలువనున్నాయని చిత్రబృందం తెలిపింది. మైఖేల్‌ రాయప్పన్‌ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

దర్శకుడు మాట్లాడుతూ.... "ఈ క్లైమాక్స్ షూటింగ్ ఓ పీడకల లాంటింది. దాదాపు 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు..మేకప్ చేసుకోవటం పూర్తయ్యే సరికే రాత్రి వంటి గంట అయ్యింది. వారితో షూటింగ్ పూర్తి చేసేసరికి ఉదయం పది అయ్యింది," అన్నారు గుర్తు చేసుకుంటూ దర్శకుడు.

అలాగే ..ఇదొక సాహసోపేతమైన ఎటెమ్ట్ అని చెప్పొచ్చు. ఈ ధిల్లర్ సినిమా తమిళంలో తొలి జాంబి చిత్రం. ఎంత రిస్క్ ఉంటుందో దిగితే కానీ తెలియలేదు. ఇది ఓ ప్రయోగం.తేడా వస్తే వరస హిట్స్ మీద ఉన్న హీరో జయం రవి...కెరీర్ పై పడుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో జోక్ లు వినిపిస్తున్నాయి. అసలు ఇలాంటి కథ ఒప్పుకోవటమే గొప్ప విషయం," అని చెప్పుకొచ్చారు.

English summary
The scene features nearly 500 junior artists as zombies. “Logistically, shooting it was a nightmare. The 500 junior artists would start getting ready with make-up at 1 am and they’d finally get done by 10 am,” Director Shakti Soundar Rajan recalled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu