»   » గ్యాప్ తర్వాత ఎ.ఆర్ హమన్ గాన కచేరీ...డిటేల్స్

గ్యాప్ తర్వాత ఎ.ఆర్ హమన్ గాన కచేరీ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ప్రముఖ సంగత దర్శకుడు ఎ ఆర్ రహమాన్ సంగీత కచేరి చేస్తున్నాడంటే ఆ క్రేజే వేరు. ఆయన అభిమానులు ఎక్కడెక్కడివాళ్లు ఎలర్టైపోతారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కచేరీలు చేయటం లేదు.

అయితే చాలా సంవత్సరాల తర్వాత ‘ఇసై పుయల్‌' (సంగీత తుపాను) ఏఆర్‌ రెహ్మాన్‌ తన అభిమానులు, ప్రేక్షకుల కోసం సంగీత కచేరీ నిర్వహించనున్నారు. నాయిస్‌ అండ్‌ గ్రైన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ కార్యక్రమాన్ని చెన్నైలో జనవరి 16, కోయంబత్తూరులో 23న ఏర్పాటు చేసింది.

A R Rahman Live Musical Concert 2016 in Chennai, Coimbatore

ఇప్పటికే దీనికోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యారు రెహ్మాన్‌. ప్రస్తుతం ఈ కచేరీకి చెందిన టికెట్లను ‘బుక్‌మైషో.కామ్‌' ద్వారా విక్రయిస్తున్నారు. ఓ ప్రముఖ ఎఫ్‌ఎం రేడియో కార్యాలయంలో కూడా అమ్ముతున్నట్లు సమాచారం.

A R Rahman Live Musical Concert 2016 in Chennai, Coimbatore

కార్యక్రమం ద్వారా వచ్చిన నగదులో కొంత చెన్నై వరద బాధితుల కోసం ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెహ్మాన్‌ నుంచి ఇలాంటి కార్యక్రమం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరిక తీరనుంది. అభిమానులపై స్వరాల వర్షం కురిపించనున్నారు రహమాన్.

English summary
Noice and Grains Entertainment organizing Isai Puyal A R Rahman Live Musical Concert “Nenje Ezhu” after next year pongal festivals. They announced that ARR Isai Thiruvizha to be happened in Chennai city on January 16, 2016 and in Coimbatore on January 23, 2016.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu