»   »  మహేష్ పరువు తీస్తుందా..లేక

మహేష్ పరువు తీస్తుందా..లేక

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మహేష్‌ కెరీర్ లో పెద్ద డిజాస్టర్ గా మిగిలిన చిత్రం ‘ఆగడు'. మహేష్ పోలీసు ఆఫీసర్ గా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈ చిత్రం ఎంత క్రేజ్ తో రిలీజైందో అంతే వేగంగా చతికిలపడింది. అయితే దాన్ని పట్టించుకోకుండా.... ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో ‘ఇదుదాండా పోలీస్‌'గా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. చెన్నై సిటీలోనే 27 ధియోటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.

తమిళంలో విడుదల చేస్తున్న భధ్రకాళి ఫిల్మ్స్ వారు ఈ సినిమాపై బాగా నమ్మకంగా ఉన్నామని చెప్తున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన చిత్రాన్ని తెరపైకి తీసుకురానున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించారు. శ్రుతిహాసన్‌ ఓ పాటకు డాన్స్ చేసింది.

 Aagadu Tamil Dub releasing on 8th

తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ.. తమిళంలో తన క్రేజీని పరీక్షించుకునేందుకు వస్తున్నారు మహేష్‌బాబు. అంతంత మాత్రంగానే గుర్తింపు తెచ్చుకున్న ‘ఖలేజా' కూడా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

‘అతడు' సినిమా ఇక్కడ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. శ్రీమంతుడు తమిళ వెర్షన్ సైతం అక్కడ పెద్ద హిట్టైంది. ఈ నేపధ్యంలో మరి ‘ఇదుదాండా పోలీస్‌' ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో వేచిచూడాలి. ఈ చిత్రాన్ని తమిళంలో భద్రకాళి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రసాద్‌ నిర్మాత. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

English summary
The dubbed Tamil version of Mahesh Babu’s flop Aagadu will be hitting the screens soon. The makers, Badrakali Films, claim that they are confident of its success of Aagadu’s Tamil version titled Idhu Dhanda Police.
Please Wait while comments are loading...