»   » దర్శకుడిపై స్టార్ కమిడియన్ పోలీస్ కంప్లైంట్ (వీడియో)

దర్శకుడిపై స్టార్ కమిడియన్ పోలీస్ కంప్లైంట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమిళంలో ప్రముఖ హాస్యనటుడు గా వెలుగుతున్న గంజాకరుప్పు శివగంగ పోలీసులకు దర్శకుడు గోపిపై ఫిర్యాదు చేశారు. తన స్వీయ నిర్మాణంలో నటుడు గంజాకరుప్పు నటించిన చిత్రం 'వేల్‌మురుగన్‌ బోర్‌వెల్స్‌'.

రెండునెలల క్రితం ఈ చిత్రం పలు సమస్యలను ఎదుర్కొని విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో గంజాకరుప్పు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

'వేల్‌మురుగన్‌ బోర్‌వెల్స్‌' చిత్ర నిర్మాణానికి ఫైనాన్స్‌ కోసం గోపి సహాయం తీసుకున్నానని తెలిపారు. ఇందుకోసం కొన్ని ఆస్తుల పత్రాలను గోపికి ఇచ్చానని.. ఆ తర్వాత రుణమిచ్చిన ఫైనాన్షియర్లకు నగదు తిరిగిచ్చేశానని అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Actor Ganja Karuppu moves police against director Gopi

అయినప్పటికీ తాను ఇచ్చిన ఆస్తుల పత్రాలను గోపి తిరిగివ్వడం లేదని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకుని తన పత్రాలను తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు

English summary
Actor-producer Ganja Karuppu filed a complaint with Sivaganga police alleging that he was cheated by film director Gopi. Ganja Karuppu produced a movie titled Velmurugan Borewells and it was directed by Gopi. The movie hit the screens a couple of months ago, but failed miserably.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu