»   » ఆదాయం లేదు, భర్తనుంచి మెయింటినెన్స్ ఇప్పించమంటూ రంభ పిటీషన్

ఆదాయం లేదు, భర్తనుంచి మెయింటినెన్స్ ఇప్పించమంటూ రంభ పిటీషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తన దాంపత్య హక్కులను పునరుద్ధరించాలని చెన్నై కుటుంబ న్యాయస్థానంలో సినీ నటి రంభ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఈలోగా రంభ దానికి అనుబంధంగా బుధవారం మరో పిటిషన్‌ వేసింది. తన భర్త తనతో కలిసి జీవించే పిటిషన్‌ అంశంలో కోర్టు తుది ఉత్తర్వులు జారీచేసే లోపు తనకు నెలకు రెండున్నర లక్షల రూపాయల భృతిని భర్త నుంచి ఇప్పించాల్సిందిగా కోరుతూ పిటిషన్‌లో పేర్కొంది.

కెనడాలో వ్యాపారాలు చేస్తున్న తన భర్త నెలకు రూ.25లక్షల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది. తనకు నటిగా ప్రస్తుతం అవకాశాలేవీ రావడం లేదని... ఇతర ఆదాయ మార్గాలేవీ లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాను, తన ఇద్దరు కుమార్తెల పోషణ, ఆలనా పాలన, విద్య, ఇతర ఖర్చుల నిమిత్తం నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చేలా తన భర్త ఇంద్రన్‌కు ఆదేశాలు జారీ చేయాలని రంభ తన పిటిషన్‌లో కోరింది.

ఇక సినీనటి రంభ దాంపత్య జీవితాన్ని చక్కదిద్దుకొనే ప్రయత్నంలో పడ్డారు. దాంపత్య హక్కులను పునరుద్ధరించుకొనేందుకు ఇటీవల చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాళీ చిత్రాల్లో మొత్తం 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె 2010 ఏప్రిల్‌లో కెనడాకు చెందిన ఇందిరన్ పద్మనాథన్‌ను వివాహమాడారు.

ఫ్యామిలి కోర్టుకి

ఫ్యామిలి కోర్టుకి

వైవాహిక జీవితంలో చోటుచేసుకొన్న విభేదాల కారణంగా గత కొద్దికాలంగా రంభ, ఇందిరన్ పద్మనాథన్ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే తాజాగా రంభ తన భర్తతో మళ్లీ కలిసి జీవించడానికి ఆమె చెన్నై ఫ్యామీలి కోర్టును ఆశ్రయించారు. హిందూ మ్యారేజీ యాక్ట్, సెక్షన్ 9 కింద రెండో అదనపు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై డిసెంబర్ 3వ తేదీన కోర్టు విచారణను చేపట్టనున్నది.

కిడ్నాప్ కేసు సైతం

కిడ్నాప్ కేసు సైతం

ఇక వివాహానంతరం కెనడా వెళ్లిన తనకు అత్తింటివారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయని, ఆస్తి కోసం భర్త, అత్త తదితరులు ఒత్తిడి చేశారని ఆరోపించారు. కెనడాలో పెద్ద కుమార్తెను తాను కిడ్నాప్‌ చేసినట్లు కూడా తనపై కేసు పెట్టి సతాయించారని పేర్కొన్నారు.

భర్తకు దూరమయ్యాను

భర్తకు దూరమయ్యాను

తాను ఇండియా వచ్చినప్పటి నుంచి భర్త తనకు దూరమయ్యాడని, అందువల్ల తన భర్తతో దాంపత్య హక్కుల్ని పునరుద్ధరించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. వారికి లావణ్య (5), ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. లావణ్య చెన్నైలోనే చదువుతోంది.

ఖండించి, వివరణ ఇచ్చింది

ఖండించి, వివరణ ఇచ్చింది

2012లో కూడా రంభ తన భర్తతో విడిపోవాలని నిర్ణయించుకుందని వార్తలు వెలువడ్డాయి. కానీ రంభ అప్పుడు ఈ వార్తలను ఖండించింది. భర్త ఇంద్రన్, కూతురు లావణ్యతో టోరంటోలో సంతోషంగా ఉన్నానని అప్పట్లో వివరణ ఇచ్చింది.

ఏం జరిగిందో తెలియలేదు

ఏం జరిగిందో తెలియలేదు

ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట విడిపోవాలని మొదట అనుకోవటానికి కారణం ఏమిటో తెలియదు కానీ....రంభ టొరొంటో నుంచి పుట్టింటికి చేరింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పలువురు ఫిల్మ్ మేకర్స్‌తో చర్చలు జరిపిన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె కండీషన్స్ కు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.

సరిగమలు వంటి చిత్రాల్లోనూ..

సరిగమలు వంటి చిత్రాల్లోనూ..

దక్షిణాది భాషలన్నిటా రంభ అందం చిందులు వేసింది... ఆ తరువాత ఉత్తరాదికీ ఆ అందం సెగ పాకింది... అక్కడా ఎందరికో బంధాలు వేసింది రంభ... తెలుగమ్మాయి అయినా ఇతర భాషల్లోనూ భళా అనిపించిందామె... కేవలం అందాల ఆరబోతతోనే కాకుండా 'సరిగమలు' వంటి చిత్రాల్లో అభినయాన్ని ప్రదర్శించిన రంభ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది..

నిర్మాతగా ప్లాన్స్

నిర్మాతగా ప్లాన్స్

ఓసారి ఆల్రెడీ నిర్మాతగా మారి చేతులు కాల్చుకుంది మాజీ హీరోయిన్‌ రంభ. ప్రస్తుతం రీ`ఎంట్రీలో అక్క, వదిన వంటి హుందాతనం ఉట్టిపడే పాత్రల్లో కన్పించాలని ఉబలాటపడ్తోన్న రంభ, ఏడాదికి ఒకటి లేదా రెండు చిన్న బడ్జెట్‌ సినిమాల్నీ నిర్మించాలనుకుని ఆ మద్యన ప్లాన్స్ వేసింది.కానీ ఎందుకనో ముందుకు తీసుకు వెళ్లలేకపోయింది.

అప్పుడు బాధపడింది

అప్పుడు బాధపడింది

యమదొంగ, దేశముదురు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో రంభ తన ఒంపుసొంపులను ఒలకబోయడానికి ఏ మాత్రం వెనకంజ వేయలేదు. అవకాశాలు సన్నగిల్లడంతో తిరిగి తన ఉనికిని చాటుకోవడానికి ఆమె టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ లకు ఒళ్లారబోస్తూ స్టెప్పులేయడానికి సిద్ధపడింది. ఐటమ్ సాంగ్స్ తో కుర్రకారును ఊపేస్తున్న రంభ తనపై ఐటమ్ గర్ల్ ముద్ర పడడంపై మనసు నొచ్చుకుంటోంది. వాటిని ఐటమ్ గర్ల్ పాత్రలు కావని గెస్ట్ రోల్స్ అని ఆ భామామణి కొత్త నిర్వచనం ఇచ్చింది. ప్రతిష్ఠాత్మకమైన బ్యానర్లు నిర్మిస్తున్న చిత్రాలు కావడంతో తాను ఐటమ్ నెంబర్స్ లో నటించడానికి అంగీకరించానని, ఐటమ్ గర్ల్ గా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది.

ఒక ఊపు ఊపింది

ఒక ఊపు ఊపింది

రాజేంద్రప్రసాద్ ..ఆ ఒక్కటీ అడక్కు చిత్రంతో కెరీర్ మొదలెట్టిన రంభ...తన అందం, నటనతో ...సౌతిండియాలో టాప్ హీరోలందరి సరసనా నటించింది.చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, మమ్ముట్టి, వి. రవించంద్రన్‌, కార్తిక్‌, వంటి టాప్‌ హీరోల సరసన నటించింది.

అక్కడ కూడా

అక్కడ కూడా

సౌతిండియాతో రంభ ప్రస్దానం ఆగలేదు. బాలీవుడ్ కి వలస వెళ్లిన రంభ అక్కడా సక్సెస్ అయ్యింది. మిథున్ చక్రవర్తి, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సునీల్ శెట్టి, విజయ్, గోవింద తదితరులతో కలిసి నటించింది.

కేవలం సినిమాలతోనే కాదు...

కేవలం సినిమాలతోనే కాదు...

పెద్ద తెరపై వెలిగిన రంభ ఆ తర్వాత... బుల్లితెరపై కూడా తనేంటో చూపెట్టింది. పలు బుల్లితెర కార్యక్రమాల్లోనూ రంభ ఎంట్రీ ఇచ్చింది. కలైంగర్ అనే టీవీ ఛానల్ లో Maanada Mayilada అనే కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించింది.

ఇప్పటికి అభిమానులు

ఇప్పటికి అభిమానులు

నిజానికి రంభ వెండితెరపై కనిపించి చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఇప్పటికి ఆమె అభిమాన సంఘాలు, ఫేస్ బుక్ పేజీలు ఉన్నాయి. రంభకు కన్నడ, తమిళం, తెలుగు, మళయాలంతో పాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఆమెకు సౌత్‌లో ఫాలోయింగ్ బాగా ఎక్కువ.

దివ్యభారతిలాగ ఉండటమే

దివ్యభారతిలాగ ఉండటమే

ఇండస్ట్రీలో అదృష్టం కలిసి వచ్చిన హీరోయిన్లలో రంభ ఒకరని చెప్పాలి అందుకు..కారణం ఈమె దివ్యభారతి పోలికలు ఉండటం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓవెలుగు వెలిగిన దివ్య భారతి ఊహించని విధంగా అనుమానస్పద పరిస్దితిలో మృతి చెందింది. అప్పట్లో ఆమె చేసి సగంలో ఆగిపోయిన సినిమాలలో కూడా రంభ ..దివ్యభారతికి డూప్ గా చేసి మెప్పించింది.

అలా మొదలై...

అలా మొదలై...

రాజేంద్ర ప్రసాద్ సరసరన సూపర్ హిట్ చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు' చిత్రంతో 1993లో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసింది. తెలుగులో స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చకుంది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ‘బొంబాయి ప్రియుడు' చిత్రంలో నటించింది. ‘బావగారు బాగున్నారా' చిత్రంలో చిరంజీవి సరసన నటించిన రంభ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లోనే కాక, బాలీవుడ్‌తో పాటు భోజ్‌పూరిలో కూడా నటించిన అనుభవం రంభకు ఉంది.

రంభపై కేసు పెట్టారు

రంభపై కేసు పెట్టారు

అప్పట్లో ...రంభపై హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రంభ సోదరుడు శ్రీనివాస్ భార్య పల్లవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసున నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదనపు కట్నం తేవాలంటూ తనను వేధిస్తున్నారంటూ పల్లవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో భర్త శ్రీనివాస్‌తో పాటు ఆడపడుచు రంభపై కూడా పల్లవి ఆరోపణలు చేసారు.

ఎందుకు దాడి చేసారో తేలలేదు

ఎందుకు దాడి చేసారో తేలలేదు

అప్పట్లో అలాగే రంభ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి విధ్వంసం సృష్టించారు. వాచ్ మేన్ ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేసారు. వారు ధర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ...ఇటీవల పెళ్లి చేసుకున్న రంభ తన భర్తతో కలసి కెనడాకు వెళ్లారు. కాగా, స్థానిక సాలిగ్రామంలోని నవనీతమ్మాళ్ వీధిలో ఉంటున్న ఆమె ఇంటిపై తెల్లవారు ఝామున 4.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ట్యూబ్ ‌లైట్లను, ఇంటి బయట ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోబోయిన వాచ్‌ మన్ దీన్ డిక్రూజ్‌ ను కూడా చితగ్గొట్టారు. ఇప్పటికీ ఆ దాడికి కారణం తెలియరాలేదు.

సిగ్గుపడేదాన్ని

సిగ్గుపడేదాన్ని

'మెగాస్టార్ చిరంజీవి నా ఫేవరెట్ కోస్టార్" అని చెప్పింది. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రంభ మాట్లాడుతూ 'ఫస్ట్ చిరంజీవి గారితో 'హిట్లర్" చిత్రంలో నటించేటప్పుడు అబ్బా...చిరంజీవిగారితో యాక్ట్ చేస్తున్నానని తెగ సంబరపడిపోయాను. ఆయన ముందు నిలబడడానికి, కూర్చోవడానికి చాలా సిగ్గు పడిపోయేదాన్ని.

చిరంజీవి తో మాట్లాడినప్పుడు

చిరంజీవి తో మాట్లాడినప్పుడు

'హబీబీ.." సాంగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ చిరంజీవిగారితో 'సార్..నేను మీ ఫ్యాన్" అని మాట్లాడాను. అప్పుడు ఆ సినిమా కెమెరామెన్, మిగతా యూనిట్ మెంబర్స్ వచ్చి చిరంజీవి గారితో 'అవునండీ, మీ ఫ్యాన్..ఎప్పుడూ మీ గురించే చెప్తారు" అని చెప్పారు. అప్పుడు చిరంజీవిగారు నాతో మాట్లాడారు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో నాకే తెలీదు. ఎంతో కో ఆపరేటివ్ గా నేను ఆయనకి కొత్త అయినప్పటికీ ఎంతో ప్రేమగా నాతో మాట్లాడారు. ఇప్పటికీ అది నేను మర్చిపోలేను" అంది.

ఆయన లేకపోతే నేను లేను

ఆయన లేకపోతే నేను లేను

అంతకు ముందు ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన లేనిదే నేను లేను అన్నట్లుగా ఉంది జీవితం అంటూ తన భర్త గురించి అప్పట్లో చెప్పుకొచ్చింది. కెనడాకి చెందిన వ్యాపారవేత్త ఇంద్రకుమార్‌ను రంభ వివాహం చేసుకున్నాక ఆమె భర్తతో కలిసి కెనడా వెళ్లిపోయంది. ఇప్పుడు నాకు అన్ని విధాలుగా తోడు, నీడగా ఉండటానికి ఇంద్రన్‌ ఉన్నారు అని చెప్పారు రంభ. తన భర్త ఇంద్రన్‌ చేస్తున్న వ్యాపారాలకు తన వంతు సహకారాన్ని అందించడానికి రంభ రెడీ అవుతున్నానంది. అలాంటిది ఇలా విడిపోవటం ఏమిటో ఎవరికి అర్దం కాలేదు.

వరసపెట్టి ఇలాంటివే

వరసపెట్టి ఇలాంటివే

బాలీవుడ్ లో మొదలైన విడాకుల వ్యవహారాలు ఈ మధ్య దక్షిణాది ఇండస్ట్రీలలోనూ కనిపిస్తోంది. ఇటీవల అమలాపాల్, సౌందర్య రజనీకాంత్ డైవర్స్ విషయం కూడా అంతటా పెద్ద టాపిక్ గా మారింది. తర్వాత ప్రస్తుతం రంభ వైవాహిక జీవితంలో సమస్య మొదలవ్వటం అందరినీ భాధిస్తోంది. ఆమె వైవాహిక జీవితం తిరిగి గాడిలో పడాలని ఫిల్మీ బీట్ తెలుగు కోరుకుంటున్నారు.

English summary
A day after moving a family court in Chennai to restore her conjugal rights, actor Rambha on Wednesday filed a maintenance petition in the same court under the provision of Hindu Marriage Act. She has sought Rs 1.5 lakh for herself and Rs 50,000 each for her two minor daughters for their upkeep on a monthly basis.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu