For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మతం, మనోభావాలు.. అంటూ "మెర్సల్" కొత్త వివాదం, సిగ్గు లేదా? అంటూ హీరో విశాల్ ఫైర్

  |

  దీపావళికి వచ్చిన మెర్సల్ నిజంగానే ఫైర్ పుట్టిస్తూనే ఉంది.సినిమా ఎలా ఉందన్న దాని కంటే కూడా అందులోని కొన్ని డైలాగుల గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఆ చిత్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు.. వైద్యులు.. జీఎస్టీకి వ్యతిరేకంగా విజయ్ పేల్చిన డైలాగులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన జీఎస్టీ మీద విజయ్ సెటైర్లు వేయడం భారతీయ జనతా పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.

  విజయ్ మతం మీదికి ఫోకస్

  విజయ్ మతం మీదికి ఫోకస్

  అటు బీజేపీ నేతలూ, ఇటు డాక్టర్లూ కలిసి విజయ్ సినిమా మీద యుద్దం ప్రకటించారు. అయితే ఈ యుద్దం లో విజయ్ తరపున నిలబడుతోంది తమిళ సినిమా పరిశ్రమ. దాంతో వివాదాన్ని దారి మళ్లించడానికి కొత్త అస్త్రం మీద దృష్టిపెట్టారు. విజయ్ మతం మీదికి ఫోకస్ మళ్లించారు.

  Vijay's Mersal BANNED By HC మెర్సల్‌పై నిషేధం, యూట్యూబ్‌లో టీజర్ రికార్డ్.....
  దేవాలయాల నిర్మాణాన్ని తప్పుబడుతూ

  దేవాలయాల నిర్మాణాన్ని తప్పుబడుతూ

  సినిమాలో ఒకచోట విజయ్.. జనాలకు కావాల్సింది దేవాలయాలు కాదని ఆసుపత్రులని అంటాడు. ఈ డైలాగ్ వెనుక ఉద్దేశం వేరని భాజపా నేతలు అంటున్నారు. విజయ్ క్రిస్టియన్ అని.. అందుకే దేవాలయాల నిర్మాణాన్ని తప్పుబడుతూ ఈ డైలాగ్ పేల్చాడని.. ఇది హిందూ మతం మీద దాడే అని వాళ్లు సూత్రీకరిస్తున్నారు.

  మత మార్పిడుల గురించి

  మత మార్పిడుల గురించి

  విజయ్ అయినా.. ఇంకొకరైనా భారీగా పెరుగుతున్న చర్చిల గురించి.. మత మార్పిడుల గురించి మాట్లాడరని.. మసీదుల ఊసు కూడా ఎత్తరని.. కానీ దేవాలయాల నిర్మాణం మీద మాత్రం సెటైర్లు పేల్చుతారని కొత్త వాదాన్ని తేరమీదకి తెచ్చి. మళ్ళీ ఇంకో కోణం లో విజయ్ మీద దాడి మొదలు పెట్టారు.

  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజా

  రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజా

  ఇక్కడ బీజేపీ విశయం లో దెబ్బతింటున్నాం అన్న ఫీలింగ్ రాగానే వెంటనే మళ్ళీ మతం కోణం లోనుంచి ఇంకో అంశాన్ని లేవనెత్తి కొత్త వివాదం మొదలు పెట్టారు. సినిమా దీపావళికి రావటమేమో గానీ ఫైర్ మాత్రం తగ్గటం లేదు.ఆ సంగతి పక్కన పెడితే ఇంకో గొడవ కూడా జరుగుతోంది... ఓ ఇంటర్వ్యూలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్‌ రాజా.. తాను మెర్సల్‌ సినిమా పైరసీ కాపీని చూశానని, అందులోని డైలాగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటం తెలిసిందే.

  పైరసీ చూశానని చెబుతున్నారు.సిగ్గు లేదా?

  పైరసీ చూశానని చెబుతున్నారు.సిగ్గు లేదా?

  ఈ నేపథ్యంలో విశాల్‌ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఓ జాతీయ నేత అయి ఉండి ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్న పైరసీని ప్రొత్సహించటం దారుణమన్నాడు. పైగా సినిమాను పైరసీలో చూశానని చెప్పటం మరింత ఘోరమని విశాల్‌ పేర్కొన్నాడు. ‘‘మీరోక బాధ్యతగల పదవిలో ఉన్నారు. పైగా సంఘంలో గౌరవం ఉన్న పెద్ద మనిషి. పైరసీ చూశానని చెబుతున్నారు. సిగ్గు లేదా?'' అంటూ ఘాటుగా రాజాకు చురకలంటించాడు.

   తక్షణమే క్షమాపణలు

  తక్షణమే క్షమాపణలు

  తక్షణమే క్షమాపణలు తెలియజేసి, పైరసీ లింకులు తొలగించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని విశాల్ ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. మరో సీనియర్‌ నటుడు పార్తీబన్‌ కూడా రాజా చేసిన పనిని తప్పుబడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. మొత్తానికి మెర్సల్ మంటలు, కలెక్షన్లూ ఇప్పట్లో తగ్గేలా లేవు..

  English summary
  The controversy over Vijay-starrer "Mersal" continued today, with actor Vishal taking exception to senior BJP leader H Raja's reported remarks that he had watched the movie online.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X