చంపేస్తానని బెదిరిస్తున్నాడు.. పలుమార్లు గర్బస్రావం చేయించి.. మాజీ మంత్రిపై చాందిని ఫిర్యాదు.. వైరల్‌గా పోస్టు
తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడిఎంకే నేత ఎం మణికందన్‌పై హీరోయిన్ చాందిని అలియాస్ శాంతిని చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దక్షిణాది మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. మణికందన్ నుంచి ప్రాణహాని ఉందని ఇటీవల చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రితో ఉన్న అక్రమ సంబంధం బయటకు వచ్చింది. ఈ క్రమంలో వివాదానికి ముందు తర్వాత చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మలేషియా టూరిజంలో పనిచేస్తుండగా
చాందిని అలియాస్ శాంతిని మలేషియాలో జన్మించారు. ఆమె మలేషియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌లో పనిచేస్తుండగా మంత్రి మణికందన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం లివింగ్ రిలేషన్‌షిప్‌గా మారింది. ఆ తర్వాత ఇద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం అని చాందిని మీడియాకు వివరించారు.

భార్యకు విడాకులిచ్చి నాతో లివింగ్ రిలేషన్‌షిప్
మణికందన్‌తో లివింగ్ రిలేషన్ గురించి చెబుతూ.. తాము ఐదేళ్లు సహజీవనం చేశాం. ఆ సమయంలో ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారు. తనను పెళ్లి చేసుకొంటానని మాటిచ్చారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ముఖం చాటేశాడు. లివింగ్ రిలేషన్‌షిప్‌లో తాను పలుమార్లు గర్బవతిని అయ్యాను. ఆయన తనకు పలుమార్లు గర్బస్రావం చేయించాడు అని చాందిని సంచలన ఆరోపణలు చేసింది.

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందు వల్లే
మాజీ మంత్రి మణికందన్ తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడం వల్లే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అంటూ చెన్నైలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. తనను, తన కుటుంబాన్ని చంపి వేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు అని ఆమె చెప్పారు. తన పార్టీ అధికారం ఉండగా తనపై పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రస్తుతం అధికారం కోల్పోయారనే ధైర్యంతోనే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను అని చాందిని చెప్పారు.

తప్పును ఎత్తి చూపితే సమస్యలు
మణికందన్‌పై ఫిర్యాదుకు ముందు హీరోయిన్ చాందిని ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్టుల్లో కూడా తన బాధను వ్యక్తం చేసింది. నీవు ఎప్పుడైతే మరొకరి తప్పును ఎత్తి చూపుతావో అప్పుడే నీకు బాధలు మొదలవుతాయి. నీవు చేసిన తప్పులను తెలుసుకొన్నప్పుడే కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతాయి అంటూ ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడించారు.
Recommended Video

ప్రపంచాన్ని నిందిస్తూ బతికేయవచ్చు అంటూ..
హీరోయిన్ చాందిని మరో పోస్టులో వైరాగ్యాన్ని వ్యక్తం చేసింది. నీ జీవితం మొత్తంలో ప్రపంచాన్ని నిందిస్తూ బతికేయవచ్చు. కానీ నీ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది నీపై ఆధారపడి ఉంటుంది. దానికి నీవే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని హీరోయిన్ చాందిని తన పోస్టులో పేర్కొన్నారు. మరో పోస్టులో ఒకవేళ నీవు నన్ను నిందించావంటే.. ప్రపంచానికి నిజం దాచేందుకు ప్రయత్నిస్తున్నావనేది స్పష్టం అంటూ హీరోయిన్ చాందినీ వరుస పోస్టులతో సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











