సినీ నటి కుష్భూ అరెస్ట్.. పోలీస్ వ్యాన్‌లో దారుణంగా.. ఏం జరిగిందంటే..

సీనియర్ హీరోయిన్, బీజేపీ నేత కుష్బూను పోలీసులు అరెస్ట్ చేయడంతో చెన్నై నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలను ప్రతిష్టను అగౌరవ పరుస్తూ వ్యాఖ్యలు చేసినందుకు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. ఆమెను పోలీస్ వ్యానులోకి తోసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఈ వివాదానికి కారణం ఏమిటంటే..

 మహిళలపై ఎంపీ తిరుమవలనవన్ వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళలపై ఎంపీ తిరుమవలనవన్ వివాదాస్పద వ్యాఖ్యలు

విదుతలై చిరుతైగల్ కచ్చి పార్టి అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తరుమవలవన్ మహిళలను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మనుస్మృతిలోని కొన్ని భాగాలను ఉదహరిస్తూ మహిళలపై ప్రతిష్టను భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. దాంతో తమిళనాడు బీజేపీ ఆన్‌లైన్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్ాయదు చేశారు.

కుష్బూ నిరసన, ఫిర్యాదు

కుష్బూ నిరసన, ఫిర్యాదు

మనుసృతి ఆధారంగా ఎంపీ తరుమవలవన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కుష్బు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా కార్యకర్తలతో కలిసి ఆమె నిరసన ప్రదర్శన చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కుష్బూ పార్టీ నేతలతో కలిసి ఎంపీ బాధ్యతరహిత తీరును ఎండగట్టారు. నిరసన చేపట్టడానికి చిదంబరం పట్టణానికి వెళ్తుండగా ఆమెను ముట్టుకాడు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

తన అరెస్ట్‌పై కుష్బూ ఫైర్

తన అరెస్ట్‌పై కుష్బూ ఫైర్

తన అరెస్ట్‌ను నిరసిస్తూ ట్విట్టర్‌లో కుష్బూ స్పందించారు. నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాన్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల ప్రతిష్ట కొరకు తుది శ్వాస వరకు పోరాటం చేస్తాను. మహిళల భద్రత గురించి ప్రధాని నరేంద్రమోదీ తగిన చర్యలు తీసుకొంటున్నారు. ఆయన బాటలో నడిచేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని దుష్టశక్తులు అరాచకాలకు తలవంచను. భారత్ మాతా కి జై అంటూ కుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇది మీ వైఫల్యానికి సంకేతం

ఇది మీ వైఫల్యానికి సంకేతం

తనను అరెస్ట్ చేసిన తర్వాత ఎంపీ తరుమవలవన్‌పై నటి కుష్బూ విరుచుకుపడ్డారు. వీఎస్‌కే పిరికివాళ్లతో కూడిన సంస్థ. నా అరెస్ట్‌ను చూసి సంతోష పడకండి. ఇది మీ వైఫల్యానికి సంకేతం. మేము బలమైన శక్తిగా ఎదుగుతున్నామని గ్రహించడం వల్లే వారు అరెస్ట్ చేశారు. అయినా వారిక దురాగతాలకు తలవంచను. భారతవానిలోని ప్రతీ బిడ్డ గౌరవానికి భంగం కలిగించినా తగిన రీతిలో జవాబు చెబుతాం అని కుష్బూ మరో ట్వీట్‌లో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X