»   »  పార్టీలో చేర్చుకున్నారు..ఆమె సెక్సీలుక్ వాడుకోవటానికా?

పార్టీలో చేర్చుకున్నారు..ఆమె సెక్సీలుక్ వాడుకోవటానికా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావటం కొత్తేమీ కాదు. కానీ వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడల్లా ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అదే సందడి భారీ అందాల భామ నమిత పోలిటిక్స్ లోకి రావటంతో నెలకొంది.

చాలా కాలంగా రాజకీయాల్లోకి వస్తానంటూ ఊరించిన నమిత మొత్తానికి పోలిటిక్స్ లోకి దూకేసారు. మరి ఆమె అభిమానులు ఈ విషయంలోనూ ఆమెకు సపోర్ట్ గా ఉంటారో లేదో చూడాలి. అయితే ఆమె అభిమానుల నుంచి ఓట్లు రాలుతాయో లేదో కానీ ఆమె మీటింగ్ లకు మాత్రం జనం గట్టిగా వస్తారని, ఆ విధంగా పార్టీ ప్రచార కాంపైన్ లకు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Actress Namitha joins active politics!

వివరాల్లోకి వెళితే...తమిళ, తెలుగు భాషల్లో ఒక వెలుగు వెలుగినవ ప్రముఖ నటి.. అభిమానులను మచ్చన్స్‌ (బావలు/మరుదులు)గా పిలిచే నమిత శనివారం అన్నాడీఎంకేలో చేరారు. తెలుగు, తమిళ చలనచిత్రాల్లో నటించిన ఈమెకు మంచి గుర్తింపు ఉండటమే కలిసి వస్తుందని అంటున్నారు.

ఈమె మొదట అన్నాడీఎంకేలో చేరాలనుకుంటున్న ఆకాంక్షను ఓ లేఖ ద్వారా అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లారు. అందుకు జయ అంగీకరించారు. అనంతరం ఎన్నికల పర్యటనలో భాగంగా తిరుచ్చిలో ఉన్న ముఖ్యమంత్రిని శనివారం సాయంత్రం కలిశారు.

ఈ సందర్భంగా నమితకు జయ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. జయలలిత తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని, పరిపాలన బాగుండటంతో అన్నాడీఎంకేలో చేరినట్లు నమిత తెలిపారు. ఈ ఎన్నికల్లో నమిత ఆ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు.

English summary
Actress Namitha has joined AIADMK in the presence Tamil Nadu Chief Minister J Jayalalithaa. She will be campaigning for the party in the current assembly elections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu