»   » లైసెన్స్ లేకుండా వాళ్ళు పిల్లలని కనకూడదు: హీరోయిన్ పై విమర్షల వెల్లువ

లైసెన్స్ లేకుండా వాళ్ళు పిల్లలని కనకూడదు: హీరోయిన్ పై విమర్షల వెల్లువ

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఔను మరి..! ఈ దేశం లో చాలా సమస్యలకు పరిష్కారం కన్నా నివారణ ముఖ్యం అనే మాట బావుంటుందనిపిస్తుంది. బాల కార్మిక వ్యవస్థ ని రూపు మాపటానికి పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన చాలా గొప్ప అభిప్రాయం వెలిబుచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ భామ కోలీవుడ్‌కు కాదల్‌ సెయ్‌వీర్‌ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. తమిళంలో పాపులర్‌ అయిన నటి నిక్కీగల్రాణి సోదరి అయిన సంజన అందరిలాగా తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేసింది.

Actress Sanjana says that To have children Licence to be delivered

ఇంతకీ ఈ డబ్బుకోసం నటించే ఈ మహా గొప్ప నటి తల్లుల గురించీ..., పిల్లల గురించీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే "మోటార్‌ వాహనాలు నడపడానికి లైసెన్స్ ఉంటుంది. వస్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది.,అదే విధంగా పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం.

చాలా మంది తల్లులు పిల్లల్ని కని వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని చంకనేసుకొని అడుక్కుంటున్నారు. మరి కొందరు మహిళలు పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొందరు సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలాంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో మార్పురాదు.

మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవశ్చవాల్లా పడిఉన్న అలాంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు.,ఇలా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అలాంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమలవ్వాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలని, అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విదించాలి" అని వ్యాఖ్యలు చేసింది.

Actress Sanjana says that To have children Licence to be delivered

అంతే కాదు తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు చేసినట్టు కూడా చెప్పుకుంది. ఈ దేశం లో కేవలం డబ్బున్న వాళ్ళకే పిల్లలని కనే హక్కు ఉండాలన్న గొప్ప ఆలోచన చేసినందుకు తన భుజం తానెర కొట్టుకున్న ఈ నటి. లక్ష రూపాయలు వాళ్ళకు పడేసినా వాళ్ళు మారరు అని చెప్పింది తప్ప మరెందరి మొకాన అలా డబ్బు వేసిందో చెప్పలేదు. అంత జాలి ఉంటే జనం కోసం అమలయ్యే సంక్ష్ఠేమ పథకాలు సరిగ్గా నడవాలని చూడాలి కానీ... అమ్మలకీ లైసెన్స్ ఇవ్వాలంటూ ఈవిడ చేసిన వ్యాఖ్య ని కొట్టి పడేస్తున్నారు సోషల్ మీడియా జనాలు.

English summary
"Recently I Went to Delhi spoke to prime minister Modi about my Idia to give license to give birth people who are capable of growing a child and should not licens to peaople who can't afford to grow a chaild" Actress Sanjana says in an interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu