»   » పోలీసులతో త్రిష వాగ్వివాదం

పోలీసులతో త్రిష వాగ్వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : చెన్నై విమానాశ్రయంలో నటి త్రిష, భద్రతాధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ వెళ్లే నిమిత్తం త్రిష ఉదయం 8 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసులకు ఆమెను గుర్తింపు కార్డు చూపమని అడిగారు. ఈ విషయంలో వాగ్వివాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికి పరిస్థితి సద్దుమణగడంతో ఆమె హైదరాబాద్‌ విమానమెక్కారు.

''చూసిన సినిమానే మళ్లీ మళ్లీ చూడాలని ఎవరికీ అనిపించదు. నేనూ అంతే. చేసిన పాత్రే మళ్లీ చేయడానికి సిద్ధంగా లేను. అందుకే చాలా సినిమాల్ని వదులుకోవలసి వచ్చింది'' అంటోంది త్రిష. తెలుగులో సినిమాలెందుకు తగ్గాయి? అని అడిగితే పైవిధంగా స్పందించింది.

Actress Trisha checked up by Chennai Airport Police

''ప్రేక్షకులు రోజుకో కొత్త రుచిని కోరుకొంటున్నారు. అందుకు తగినట్టుగా సిద్ధమైతేనే వారికి నచ్చుతుంది. కొత్త పాత్రలు వచ్చినప్పుడు నటించడానికి మాక్కూడా ఎంతో హుషారుగా ఉంటుంది. 'ఇలాంటి పాత్ర ఇంతకు ముందు చేసేశాం' అనిపించినప్పుడు ఎలాంటి ఆసక్తి చూపించలేం. నన్ను నేను కాపీ కొట్టుకోవడం ఏం బాగుంటుంది?'' అంటోంది.

''కహానీ', 'ద డర్టీ పిక్చర్‌' లాంటి సినిమాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రయోగాలు చేయొచ్చు. కానీ మన పరిధి, పరిమితులు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే అభాసుపాలవుతాం'' అని ముక్తాయించింది.

English summary
Actress Trisha went to Airport on morning at 8 am for going to Chennai to Hyderabad. She was wearing Pant, Shirt and Cooling specs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu