For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిలీజ్ దగ్గర కి వచ్చింది... గొడవ మళ్ళీ మొదటికొచ్చింది

  By Srikanya
  |

  చెన్నై : ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండో చిత్రం 'కత్తి'. విజయ్‌తో సమంత తొలిసారిగా జతకడుతోంది. అనిరుధ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రారంభం నుంచే పలు సమస్యలను ఎదుర్కొంటోంది. గతంలో ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌ కాంబినేషన్లో వచ్చిన 'తుప్పాక్కి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వీరి తదుపరి చిత్రంపై అంచనాలు పెద్దస్థాయిలోనే ఉన్నాయి. అయితే చిత్రం విడుదల మాత్రం అయ్యేటట్లు కనపడటం లేదు. టిక్కట్ల అమ్మకం ఎక్కడా ప్రారంభం కాలేదు.

  ఇక ఈ సినిమా తెరమీదకు రావాలంటే.. బ్యానర్ నుంచి లైకా ప్రొడక్షన్స్ పేరు తీసేయాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. ఆ పేరు లేకపోతే మాత్రం సినిమా విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, వాళ్లు ఆ పేరు తీయకపోతే మాత్రం.. మొత్తం వందకు పైగా తమిళ సంఘాలు ఆ సినిమా తమిళనాడులోని ఏ థియేటర్ లోనూ విడుదల కాకుండా అడ్డుకుంటాయని ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న టి.వేల్ మురుగన్ చెప్పారు.

  తమిళ అనుకూల వర్గాలు, థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా నిర్మాతల మధ్య సోమవారమే ఓ సమావేశం నిర్వహించి ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే సాధారణ థియేటర్ల నుంచి మల్టీ ప్లెక్సుల వరకు ఎక్కడా ఇంకా సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాలేదు. విశ్వరూపం సినిమా విడుదల విషయంలో కూడా కొంత గందరగోళం నెలకొనడంతో చాలా వరకు థియేటర్లకు భారీ నష్టాలు వచ్చాయి. అలాంటి పరిస్థితిని కల్పించాలని తాము అనుకోవట్లేదని తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం సభ్యుడొకరు తెలిపారు. ఇక విజయ్ ఇంతకుముందు నటించిన 'తలైవా' సినిమా కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొంది.

  Again Kathi facing problems

  'కత్తి' ఆడియో విడుదల కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించాలని భావించారు. పలు ఇబ్బందులు రావడంతో సాదాసీదాగా కానిచ్చేశారు. సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. సమస్య కొనసాగడంతో 22వ తేదీన తెరపైకి తీసుకురానున్నట్లు ప్రకటించారు నిర్మాత కరుణాకరన్‌. 1,500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

  నిర్మాత మాట్లాడుతూ.. '' దీపావళి కన్నా ముందు విడుదల చేయాలని అనుకోలేదు. పండుగ రోజున తెరపైకి తీసుకురావాలనే భావించాం. అన్నీ సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా వెయ్యి, విదేశాల్లో అయిదొందల థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఇందులో ఎలాంటి మార్పులుండవ''ని చెప్పారు. 'కత్తి' తెలుగు వెర్షన్‌ 31వ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం.

  ఇక మురుగదాస్‌ కథలన్నీ విభిన్నంగా ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ మొమొరీ లాస్‌ అనే కథాంశంతో 'గజిని' తీర్చిదిద్దారు. 'రమణ', 'సెవెన్త్‌సెన్స్‌', 'తుపాకీ' కూడా సాధారణ సినిమాలకు విభిన్నంగా సాగేవే. అందుకే మురుగదాస్‌ సినిమా వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి. ఇప్పుడాయన 'కత్తి' పదును చూపించబోతున్నారు. విజయ్‌, సమంత జంటగా నటించిన చిత్రమిది. కె.కరుణామూర్తి, ఎ.శుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మించారు.

  అనిరుథ్‌ స్వరాలు అందించారు. ఈ నెల 24న 'కత్తి' పాటల్ని విడుదల చేస్తారు. చిత్ర సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే యాక్షన్‌ చిత్రమిది. సెంటిమెంట్‌కీ చోటుంది. అనిరుథ్‌ స్వరాలు అదనపు ఆకర్షణ. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

  English summary
  Vijay, Samantha’s starrer ‘Kathi’produced on Lyka banner. They allege the banner management is close to Sri Lankan President Raja Pakse and demanded the film shouldn’t be released in Tamil Nadu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X