Thala కు షాకిచ్చిన ఎంఎస్ ధోని.. తమిళ సూపర్ స్టార్ అజిత్ సంచలనం నిర్ణయం

దక్షిణాది సూపర్‌స్టార్స్‌లో ఒకరైన అజిత్ అలియాస్ అజిత్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. వాలిమై సినిమా బిజీలో ఉన్న అజిత్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కరోనావైరస్ కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఫ్యాన్స్‌కు ఇలాంటి ఆనంద సమయంలో అజిత్ షాకిచ్చారు. ఇంతకు అజిత్ తీసుకొన్న సంచలన నిర్ణయం ఏమిటంటే..

అభిమానులు ముద్దుగా తలా అని..

అభిమానులు ముద్దుగా తలా అని..

2000 సంవత్సరంలో దర్శకుడు ఏఆర్ మురగదాస్ డైరెక్షన్‌లో ధీనా చిత్రంలో నటించినప్పటి నుంచి అజిత్‌ను అభిమానులు ముద్దుగా తలా (నాయకుడు) పిలుచుకోవడం మొదలుపెట్టారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అజిత్ తలాగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. తలా అంటే ఠక్కున గుర్తొచ్చేది అజిత్ మాత్రమే. అలా ఫ్యాన్స్‌ క్రేజీగా తలా అంటూ పిలవడంతో సోషల్ మీడియాలో కూడా ఆ పేరుకు బ్రాండ్ ఏర్పడింది.

తలా పేరును తొలగించుకోవాలని..

తలా పేరును తొలగించుకోవాలని..

అయితే అభిమానులు ముద్దుగా పిలుచుకొనే తలా బిరుదును తన పేరు ముందు నుంచి తొలగించుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఇక నుంచి తన పేరుకు తలా అని జోడించవద్దని వేడుకొన్నారు. తనను ఇక నుంచి అజిత్ లేదా అజిత్ కుమార్ అని మాత్రమే పిలువాలని అజిత్ సూచించినట్టు తెలిసింది. దాంతో అభిమానులు ఒకింత దిగ్బ్రాంతికి గురవుతున్నారు. 20 ఏళ్లుగా పిలుచుకొంటున్న పేరును తొలగించమనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అజిత్ లేదా అజిత్ కుమార్ లేదా ఏకే అని

అజిత్ లేదా అజిత్ కుమార్ లేదా ఏకే అని

అజిత్ కోరిక మేరకు ఆయన పీఆర్వో సురేష్ చంద్ర ట్విట్టర్‌లో ఓ మెసేజ్ పెట్టారు. అభిమానులకు, ప్రజలకు, మీడియాకు విన్నవించుకొనేది ఏమిటంటే.. ఇక నుంచి అజిత్‌ను తలా అని పిలువవద్దు. ఆయనను అజిత్ అని గానీ, అజిత్ కుమార్ అని గానీ, లేదా ఏకే అని పిలవండి లేదా రాయండి. నా పేరుకు ముందు తలాను జోడించవద్దు. ప్రస్తుతం సమయంలో మీరంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని అనుకొంటున్నా. మీ ఆదరణ ఎప్పటిలానే అందించాలని కోరుకొంటున్నాను అని అజిత్ తరఫున సురేష్ చంద్ర ట్వీట్ చేశారు.

అజిత్‌కు ధోని తెచ్చిన తంటా

అజిత్‌కు ధోని తెచ్చిన తంటా

అయితే తలా బిరుదును తొలగించుకోవడం వెనుక కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనిని కూడా తలా అని పిలుస్తున్నారు. ధోనిని ఎవరైనా టార్గెట్ చేసి అసభ్యకరమైన పదాలతో దూషించినప్పుడు తలా ట్రెండింగ్‌లోకి వస్తున్నాడు. దాంతో అజిత్‌ అనే తప్పుడు అభిప్రాయం కలుగుతున్నది. దాంతో ఇలా అజిత్ సంచలన నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Analysis On Manas Vs Priyanka.. Who Is On Point ? || Filmibeat Telugu
సంక్రాంతి బరిలో వాలిమైతో అజిత్

సంక్రాంతి బరిలో వాలిమైతో అజిత్

ఇలా ఉండగా, హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం రీమేక్ నేర్కొండ పార్వాయి చిత్రం తర్వాత ప్రస్తుతం అజిత్ వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొన్నది. సంక్రాంతి బరిలో ఈ సినిమా దూకేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ ఈ చిత్రంలో విలన్‌గా ఓ కీలక పాత్రలో నటిస్తుండటం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X