»   » సంక్రాంతి సినిమాకి రిజర్వేషన్ హంగామా ప్రారంభం

సంక్రాంతి సినిమాకి రిజర్వేషన్ హంగామా ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ajith's latest film Veeram Update
చెన్నై : తల అజిత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'వీరం'. తమన్నా హీరోయిన్. శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అజిత్‌తోపాటు పలువురు ప్రముఖ నటులు కూడా కనిపించనున్నారు. చెన్నైలోని పలు థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన రిజర్వేషన్‌ టికెట్లను అప్పుడే విక్రయిస్తున్నారు.
అజిత్‌ చాలా రోజుల తర్వాత మాస్‌ గెటప్‌లో కనిపిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. నగరంలో మాత్రమే యాభైకిపైగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. తొలిసారిగా అజిత్‌ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చుతుండటం విశేషం. ఇప్పటికే పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. సంక్రాంతికి విజయ్‌ నటించిన 'జిల్లా' కూడా విడుదల కానుంది.

ఇక అజిత్ తాజా చిత్రం 'వీరం'లో పంచ్ డైలాగులు ఉండవని చెప్తున్నారు దర్శకుడు శివ. శివ మాట్లాడుతూ... 'వీరం' కథ కోసం ఎన్నెన్నో పంచ్‌ డైలాగులను సిద్ధం చేశా. కానీ కథ విన్న అజిత్‌.. ఆ పంచ్‌లు వద్దని చెప్పేశారు. మేం నిరాశ చెందలేదు. ఆయన అభిరుచికి తగ్గట్టు మాటలు రాశాం. ఇందులో సాధారణ గ్రామీణ యువకుడి పాత్రలో నటిస్తున్నారాయన. పాత్ర పేరు 'వినాయకం' అన్నారు. ఇక తెరవెనుక అజిత్‌ గురించి చెప్పాల్సిందే. చాలా సరదా వ్యక్తి. తాను నవ్వుతూ.. సెట్‌లోని అందర్నీ నవ్వించే వ్యక్తిత్వం. ఆ హాస్య హావభావాలు నాకెంతో నచ్చాయి. వాటినే సినిమాలో చూపించాలని అజిత్‌ను అడిగా. ప్రేక్షకులు ఒప్పుకుంటారా? అని అడిగారు. దుమ్ము లేచిపోతుందని చెప్పా. చిన్నగా నవ్వి.. సరేనన్నారు అని చెప్పుకొచ్చారు.

శివ కథ గురించి చెప్తూ ...అజిత్‌ వద్దకు వెళ్లినప్పుడు... 'గ్రామీణ నేపథ్యంలో కథ తయారుచేయండి. మామ, బామ్మరిది, అన్న, తమ్ముడు.. ఇలా అన్ని కుటుంబ పాత్రలూ అందులో కనిపించాల'ని సూచించారు. 'గుడ్‌ ఫీల్‌' లభించే కుటుంబ కథలో నటించాలనుందని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే 'వీరం' కథ అల్లాను. కథనం కూడా చాలా చక్కగా వచ్చింది. ఇందులో క్త్లెమాక్స్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటిభోజనంలా ఉంటుంది. అంటే.. అన్నం, సాంబారు, రసం... అనుకునేరు. నాటుకోడి, చేపల పులుసు వంటి రుచికరమైన విందును ప్రేక్షకులకు అందజేయనున్నాం అన్నారు.

English summary

 Veeram Update : Vijay Cinemas, Trichy will start reservation for Veeram from Jan 2:
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu