»   »  టీజర్ కేక పెట్టిస్తోంది...మీరూ చూడండి (వీడియో)

టీజర్ కేక పెట్టిస్తోంది...మీరూ చూడండి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : వీరమ్ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతోంది. అజిత్ కెరీర్ లో 56వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా... లక్ష్మీమీనన్ అజిత్ చెల్లెలి పాత్ర పోషిస్తోంది. 'వేదాలం' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారు. ఈ చిత్రం టీజర్ ని ఈ రోజు విడుదల చేసారు. ఈ టీజర్ ..అజిత్ అభిమానులనే కాక అందరినీ విశేషంగా అలరిస్తోంది. మీరూ ఈ టీజర్ ని చూడండి.

ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

 Ajith's Vedalam Official Teaser

అయితే ఈ గెటప్ చూసినవారు దాదాపు పదమూడేళ్ల క్రితం అజిత్ నటించిన రెడ్ సినిమాలోని గెటప్ ను పోలి ఉందంటున్నారు.... ఇటీవల అజిత్ చిత్రాలన్నీ తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగులో డబ్ కానుంది. గతంలో అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన వీరమ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నవంబర్-10న వస్తున్న వేదాలం.. ఆ అంచనాలను అందుకుని అజిత్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

English summary
Watch the breathtaking teaser of Thala Ajith's Vedalam directed by Siva with music by Anirudh Ravichander. The film also stars Shruti Hassan & Lakshmi Menon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu