డిసెంబర్ 10న 'దరువు' దర్శకుడు చిత్రం ప్రారంభం
అజిత్ ప్రస్తుతం వరుసపెట్టి చిత్రాలు చేస్తున్నాడు. మరికొద్ది రోజుల్లోనే కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. ఎలాంటి వెన్నుదన్ను లేకుండా వెండితెరపైకి వచ్చి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎవరి కోసమూ తన వ్యక్తిత్వాన్ని వదులుకోని అజిత్ తనకెంతో ఇష్టమైన బైక్‌రేస్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ కారణంగా ఒకదశలో ఆయన సినిమాల మధ్య చాలా విరామమే వచ్చింది.
అయితే అభిమానులు, నిర్మాతలను దృష్టిలోకి తీసుకుని తన పంథా మార్చుకున్నాడు. పూర్తిగా వెండితెరకే అంకితమైపోయాడు. 'బిల్లా-2' పూర్తి చేసిన వెంటనే విష్ణువర్ధన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంకా పేరు నిర్ణయం కాని ఈ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. 'తల' పేరును పెట్టాలని భావించినా అజిత్ వ్యతిరేకత తెలపటంతో మరో టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు కొత్త సినిమాలకి సంబంధించిన కథలు వినే యోచనలో ఉన్నాడట అజిత్.


Click it and Unblock the Notifications












