»   » నేను కాదంటూ కమల్ రెండో కూతురు కొట్టిపారేసింది(కొత్త ఫొటోలు)

నేను కాదంటూ కమల్ రెండో కూతురు కొట్టిపారేసింది(కొత్త ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : విశ్వనటుడు కమలహాసన్‌ చిన్న కుమార్తె అక్షర హాసన్ గుర్తుండే ఉండి ఉంటుంది. హిందీలో 'షమితాబ్‌' తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు వరసగా వచ్చాయి. పేరున్న దర్శకులు, నిర్మాతలు ఆమె వద్దకు వచ్చినా ఏ చిత్రంలోనూ నటించడానికి ఆమె ఒప్పుకోలేదు. ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తాజాగా లింగుసామి- విశాల్‌ కాంబినేషన్‌లో విడుదలైన 'సండకోళి' (పందెం కోడి) చిత్రానికి రెండో భాగంలో అక్షర హాసన్‌ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కమల్ కు లింగుసామి కు ఉత్తమ విలన్ తో ఉన్న పరిచయం దృష్ట్యా ఆమెను కలిసి ఒప్పించారంటూ తమిళ మీడియా రాసుకొచ్చింది. కానీ అవన్నీ ఉత్తి మాటలే అంటూ అక్షర కొట్టిపారేసింది. తనను ఎవరూ కలవలేదంది. అలాంటి రూమర్స్ క్రియేట్ చేయద్దని అంది.

ప్రస్తుతం 'పాయుం పులి' చిత్రంలో విశాల్‌ నటిస్తుండగా ఆ చిత్రం పూర్తయిన తర్వాత 'సండకోళి' సీక్వెల్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ చిత్రంలో 'సండకోళి' హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ ఓ చిన్న క్యారెక్టరులో నటించనున్నట్లు తెలిసింది.

హీరోయిన్‌గా అక్షర హాసన్‌ నటిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టి పారేశారు. హీరోయిన్‌గా నటించే విషయమై 'సండైకోళి' యూనిట్ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు.

ఆమె లేటెస్ట్ ఫొటోలు...

షమితాబ్ లో ...

షమితాబ్ లో ...

ధనుష్ చిత్రం షమితాబ్ లో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆమె ధనుష్ కు పోటీ ఇచ్చిందన్నారు.

పూర్తి స్దాయి హీరయిన్ కాదు

పూర్తి స్దాయి హీరయిన్ కాదు

కానీ అక్షర హాసన్ కు ...షమితాబ్ చిత్రం పూర్తి స్ధాయి హీరోయిన్ ఇమేజ్ ఇవ్వలేకపోయింది.

ఆఫ్ బీట్ కే...

ఆఫ్ బీట్ కే...

షమితాబ్ విడుదల అయ్యాక ఆమెకు అన్నీ ఆఫ్ బీట్ చిత్రాల ఆఫర్సే వచ్చినట్లు సమాచారం.

తండ్రి సలహాలు

తండ్రి సలహాలు

తన తండ్రి కమల్ సలహాలు తో ..ఆమె తన కెరీర్ కు పనికి వచ్చే ప్రాజెక్టులతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది

ఇంట్లోనే పోటీ

ఇంట్లోనే పోటీ

తనకు తన సోదరి శృతి హాసన్ తో ఇంట్లోనే పోటీ ఉందంటే నవ్వుతూ కొట్టిపారేస్తుంది.

English summary
News said... Akshara Haasan, who was recently seen in R. Balakrishnan aka Balki-directed "Shamitabh", has been approached to play the leading role in upcoming Tamil actioner "Sandakozhi 2". But Akshara said these are all baseless rumers.
Please Wait while comments are loading...