»   » నాగచైతన్య హీరోయిన్ సిద్దార్ధతో కమిటైంది

నాగచైతన్య హీరోయిన్ సిద్దార్ధతో కమిటైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్న సినిమాతో పరిచయమై నాగచైతన్య బెజవాడ రౌడీల్లో బుక్ అయిన హీరోయిన్ అమలా పౌల్. ఆమె తాజాగా సిద్దార్ద సరసన ఎంపికయ్యింది. బాలాజీ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న చిత్రంలో ఆమెను తీసుకున్నారు. 180 తర్వాత తెలగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న సిద్దార్ధ సినిమా ఇదే. అమలా పౌల్ కి రెండు భాషల్లోనూ ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆమెను తీసుకున్నారు. ఇక ప్రస్తుతం సిద్దార్ధ.. దిల్ రాజు నిర్మిస్తున్న ఓ మై ప్రెండ్ చిత్రంలో చేస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా వేణు శ్రీరామ్ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. నవదీప్, హన్సిక ఒక పెయిర్ గానూ, సిద్దార్ద.. శృతిహాసన్ మరో పెయిర్ గానూ ఈ చిత్రంలో కనిపించనున్నారు. స్నేహం, ప్రేమ చుట్టూ తిరిగే కధాంశంతో ఈ కథ తెరకెక్కుతోంది. అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై దిల్ రాజుకి మంచి అంచనాలు ఉన్నాయి.ఇక సిద్దార్ద సరసన ఎంపిక కావటంతో అమలా పౌల్ చాలా ఉత్సాహంగా ఉంది.

English summary
Actor Siddharth and Amala Paul are paired up for a soon to be launched film. This will be directed by Balaji on Y Not Studios banner. This is a bilingual ala 180. It will be simultaneously made in Telugu and Tamil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu