»   » వేశ్యగృహాలకు అమ్మేసేవాడే.. అక్కడికి రమ్మని బలవంతం.. సెక్స్ రాకెట్ హస్తం.. అమలాపాల్

వేశ్యగృహాలకు అమ్మేసేవాడే.. అక్కడికి రమ్మని బలవంతం.. సెక్స్ రాకెట్ హస్తం.. అమలాపాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనపై ఓ వ్యాపారవేత్త లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తనను మానసికంగా క్షోభకు గురిచేసిందని దక్షిణాది తార అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది. కొద్దిరోజలు క్రితం మలేషియాలో జరిగే ఓ షో కోసం ప్రాక్టీస్ చేస్తుండగా అలగేషన్ అనే వ్యాపారవేత్త తన కోరిక తీర్చమని వేధించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మరోసారి అమలాపాల్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..

 కోరిక తీర్చమని వెంటపడి

కోరిక తీర్చమని వెంటపడి

మలేషియాలో జరిగే ఈవెంట్ కోసం చెన్నైలోని డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ సమయంలో వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చమని వెంటపడ్డాడు. అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు అని అమలాపాల్ తెలిపారు.

స్పెషల్ డిన్నర్ వస్తావా?

స్పెషల్ డిన్నర్ వస్తావా?

నన్ను స్పెషల్ డిన్నర్‌కు వస్తావా అని అలగేషన్ అడిగాడు. దాంతో నాకు ఏదో అనుమానం వచ్చింది. నేనేమైనా చిన్న పిల్లానా.. నీ మాటలు నమ్మి మోసపోవడానికి అని గట్టిగా నిలదీసే సరికి ఆయన నీళ్లు మింగాడు. అయినా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించాడు. దాంతో స్టూడియో సిబ్బందికి కాల్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని అమలాపాల్ వెల్లడించింది.

 పారిపోవడానికి ప్రయత్నించాడు

పారిపోవడానికి ప్రయత్నించాడు

స్టూడియో వద్ద తిరుగుతున్న అలగేషన్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. నా వ్యక్తిగత సిబ్బంది పట్టుకొని స్టూడియోలోని రూంలో బంధించారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసి అతడిని పోలీసులకు అప్పగించాం అని ఆమె ఇటీవల మీడియాకు తెలిపారు.

 అనుమానాస్పదంగా

అనుమానాస్పదంగా

అతని తీరు చాలా అనుమానాస్పదంగా ఉండటంతో నేను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఏ మహిళైనా తనకు తాను రక్షించుకోవడానికి పోలీసుల సహాయం తీసుకోవాల్సిందే అని అమలాపాల్ అన్నారు.

 నన్ను అమ్మేసేవాడే

నన్ను అమ్మేసేవాడే

వ్యాపారవేత్త ప్రవర్తనశైలిపై మొదటి నుంచి అనుమానం వచ్చింది. నేను ఏమాత్రం పొరపాటు చేసిన నన్ను అమ్మేసే వాడే అనే భయం కలిగింది. ఆయన తీరుతో నేను మానసికంగా కుంగిపోయాను అని అమలాపాల్ చెప్పింది.

 విశాల్‌కు థ్యాంక్స్

విశాల్‌కు థ్యాంక్స్

ఈ వ్యవహారంలో వ్యాపారవేత్తపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంపై స్పందించి.. మద్దతుగా నిలిచిన విశాల్‌కు థ్యాంక్స్. నా ఫిర్యాదును అందుకొన్న పోలీసులు ఆయనపై 354ఏ, 509 సెక్షన్ల కింద కేసు పెట్టారు.

 సెక్స్ రాకెట్ కుట్ర

సెక్స్ రాకెట్ కుట్ర

నా ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అతడి వద్ద నా లేటెస్ట్ నంబర్ ఉంది. నా గురించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ వ్యవహారం వెనుక సెక్స్ రాకెట్ ఉంది అనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. భాస్కర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బెయిల్ ఇవ్వకుండా చర్యలు తీసుకొన్నారు.

English summary
wo weeks after Amala Paul accused a businessman named Alagesan for making sexual advances at her while she was rehearsing in a dance studio, the actress has shared the exact details of the ordeal. After Paul had lodged a complaint on 31 January on Alagesan for harassing her at the workplace, the police had booked a case against the 40-year-old man from Kottivakkam under Sections 354A, 509.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu