»   » భర్తతో విడిపోయిన తర్వాత అమలా పాల్ చేస్తున్న పని ఇదే...ఆశ్చర్యపోకండి

భర్తతో విడిపోయిన తర్వాత అమలా పాల్ చేస్తున్న పని ఇదే...ఆశ్చర్యపోకండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న నటి అమలా పాల్‌.. భర్త ఏఎల్‌ విజయ్‌తో విడిపోవటానికి నిర్ణయించుకుని డైవర్స్ కు అప్లై చేసిన సంగతి తెలిసిందే. భేదాభిప్రాయాల కారణంగా ఇద్దరూ పరస్పరం విడిపోవాలనుకుంటున్నారని, విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు వీరిద్దరికి నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఇప్పుడు అమలాపాల్ తన జీవితం తను అన్నట్లుగా హ్యాపీగా , రకరకాల వ్యాపకాలతో గడుపుతున్నారు. ఆ వ్యాపకాలు ఏంటి...ఏం చేస్తోంది అంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.

ఈ నేపధ్యంలో అమలాపాల్ ఏం చేస్తోంది. ఏ సినిమాలు ఒప్పుకుందనే విషయాలు ఆసక్తికరమే. ఇదే ప్రశ్నను మీడియావారు ఆమె ముందు ఉంచారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త విజయ్ నుంచి విడిపోయిన నటి అమలాపాల్ లైఫ్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు 'చాలా సంతోషంగా ఉంది.

నేను ఇంతకు ముందు శిక్షణ పొందిన యోగాతో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నాను.ఆనందం అన్నది బయట ఎక్కడ నుంచో రాదు. అది మనలోనే ఉంటుం ది. అయినా నేను నటినవ్వడం, ప్రేమ, పెళ్లి, విడిపోవడం, ఇప్పుడిలా భేటీ ఇవ్వడం అంతా నాకు ఆశ్చర్యంగా ఉంది' అని బదులిచ్చారు. భర్త నుంచి విడిపోయిన తరువాత అమలాపాల్ నటిగా తన వేగాన్ని పెంచారు. సరే గానీ ఇంతకీ అమలాపాల్ ఏం చేస్తోంది అంటారా.

చంద్రిక సోప్ కోసం

అమలాపాల్ గత మూడు సంవత్సరాలుగా చంద్రిక సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. అందులో భాగంగానే రీసెంట్ గా ముంబైలో ఆమె షూటింగ్ లో పాల్గొంది. ఈ విషయాన్ని అమలాపాల్ తెలియచేసింది.

ఆ యాడ్ ఫొటో ఇదే

అమలా పాల్ చేస్తున్న చంద్రికా సోప్ యాడ్ షూటింగ్ కు చెందిన ఫొటోను ఆమె స్వయంగా ఇనిస్ట్రగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటో ఇదిగో మీరు ఇక్కడ చూడవచ్చు.

హ్యాపీడేస్ ఆర్ కేమ్

భర్తతో విభేధాలు వచ్చి విడిపోయాక ఒంటిరగా ఉన్న అమలాపాల్ ... తనకు ఇష్టమైన స్నేహితురాళ్లను కలుస్తోంది. వాళ్లతో సరదాగా గడుపుతోంది. ఆ ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది.

పూర్తి ఎంజాయ్

జీవితాన్నీ పూర్తి స్దాయిలో ఎంజాయ్ చేయాలని అమలా ఫిక్సైనట్లుంది. విడాకులకు అప్లై చేసి తన స్నేహితులను రెగ్యులర్ గా కలుస్తోంది. ఆ క్రమంలో తన విడాకుల పర్వాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తోంది.

చెన్నైలో ఇలా...

తాజాగా చెన్నైలో జరిగిన సెలెబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. స్టార్ క్రికెట్ తరహాలో బ్యాడ్మింటన్ లీగ్ పోటీల్లో చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరులలో జరుగుతోంది. ఫైనల్ పోటీలు మలేషియా రాజధాని కోలాలంపూర్‌లో జరుగుతోంది. ఇందులో చెన్నై తరపున ఆడే క్రీడాకారులను పరిచయం చేసే కార్యక్రమంలో చెన్నైలో జరిగింది.

 అమలాపాల్ @కాశ్మీర్

అమలాపాల్ @కాశ్మీర్

అమలాపాల్ ఇప్పుడు తనను తాను ఇన్వెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఆమె టూర్లు వేస్తోంది. ఇదిగో ఇలా కాశ్మీర్ లో ప్రత్యక్ష్యమై అక్కడ ఫొటోలు దిగింది. ఆమె ముఖంలో ఆనందం ఎలా తాండవిస్తోందో గమనించారా...

ఇదీ ఏటిట్యూడ్ అంటే..

తన వైవాహిక జీవితంపై వస్తున్న విమర్శలను అమలా పాల్ ధీటుగా ఎదుర్కొంది. తనపై ఎన్ని విమర్శలొచ్చినా.. ఏమాత్రం పట్టించుకోకుండా.. నిలదొక్కుకుంది. ఇదిగో అందుకు సింబాలిక్ గా ఇలా..

కుంగిపోలేదు, కుమిలిపోలేదు

కుంగిపోలేదు, కుమిలిపోలేదు

విడాకుల విషయమై అమలా పాల్‌పైనే మీడియా, సామాజిక మాధ్యమాలు దుమ్మెత్తిపోశాయి. అమలాపాల్ వ్యక్తిగత వ్యవహారాన్ని సోషల్ మీడియా, ఆన్ లైన్ మీడియా రోడ్డుకీడ్చాయి. అయితే ఇలాంటి ఆరోపణలకు సాధారణంగా మహిళలు కుమిలిపోతారు. కానీ అమలా పాల్ మాత్రం విమర్శలను ధీటుగా ఎదుర్కొంది.

మళయాళంలో నటించిన ..

మళయాళంలో నటించిన ..

విజయ్‌ దర్శకత్వం వహించిన దీవ తిరుమగల్‌ చిత్రంలో అమలా నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో 2014 జూన్‌12న వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం అమలా పాల్‌ మలయాళంలో నటించిన షాజహనుమ్‌ పరీకుట్టియం చిత్ర ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉంది.

ధనుష్ తో ..

ధనుష్ తో ..

మలయాళ బ్యూటీ అమలాపాల్ డైరెక్టర్ ఎ.ఎల్ విజయ్ నుండి విడాకులకు అప్లై చేసిన తర్వాత పలు సినిమాలతో బిజీగా మారింది. వచ్చిన ఆఫర్లన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన లైఫ్‌ని బిజీగా మార్చుకుంటుంది. ఇప్పటికే ధనుష్ హీరోగా రూపొందుతున్న వడచెన్నయ్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న అమలా కన్నడ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

తన రీమేక్ లో తనే

తన రీమేక్ లో తనే

గతంలో ధనుష్, అమలాపాల్ కాంబినేషన్‌లో వచ్చిన తమిళ మూవీ వేల ఇల్లే పట్టాదరి(విఐపి)ని ప్రస్తుతం కన్నడలో రీమేక్ చేస్తోండగా ఇందులోను హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఈ అమ్మడికే దక్కింది. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాణంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్ తనయుడు మనోరంజన్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం చాలా మందిని అనుకున్న చివరికి అమలాపాల్‌నే ఫైనలైజ్ చేశారట.

సుదీప్ సరసన

సుదీప్ సరసన

మొత్తానికి విడాకుల తర్వాత అమలా సినిమాలపైనే తన పూర్తి దృష్టిని పెట్టడం విశేషం. సుదీప్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హెబ్బులి అనే చిత్రంలోను అమలా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఎక్కడ ప్లాబ్లం వచ్చిందో మరి

ఎక్కడ ప్లాబ్లం వచ్చిందో మరి

బెజవాడ', 'నాయక్‌', 'ఇద్దరమ్మాయిలతో' సినిమాల ద్వారా సుపరిచితురాలయ్యారు నటి అమలాపాల్‌. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్నారు. వివాహానంతరం కూడా ఆమె పలు సినిమాల్లో నటించారు. తన భర్త విజయ్‌ నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారని కూడా ఆమె పలుమార్లు ప్రస్తావించారు. అయితే కొంతకాలంగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

మాకే తెలుసు ఆ కారణం

మాకే తెలుసు ఆ కారణం

విజయ్‌ స్పందిస్తూ అమలాపాల్ తో విడిపోవడానికి సంబంధించిన వార్తల్లో వచ్చిన కారణాల్లో ఏమాత్రం నిజం లేదని, తాము విడిపోతున్నందుకు కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు. తన స్నేహితులు, కొందరు మీడియా మిత్రులు కారణం చెప్పమని అడిగినా తన వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడం ఇష్టం లేక చెప్పలేదన్నారు. మహిళలపై, సమాజంపై గౌరవం ఉన్న వ్యక్తినని, అందువల్లే తాను దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లోనూ వారి ఆత్మగౌరవం ప్రతిబింబించేలా స్త్రీల పాత్రలను చిత్రీకరించానన్నారు.

కలలో కూడా ఊహించనది ఇది..

కలలో కూడా ఊహించనది ఇది..

పెళ్లి తర్వాత కూడా నటించాలని అమలాపాల్‌ కోరడంతో సంతోషంగా సరేనన్నానని పేర్కొన్నారు. కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నందువల్లే తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ సత్యదూరమేనన్నారు. తామిద్దరం విడిపోతామని తాను కలలో కూడా వూహించలేదని, కానీ నమ్మకం, నిజాయితీ లేనప్పుడు కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు. అందువల్లే తీవ్రమైన ఆవేదనతో విడిపోతున్నానని, వాస్తవాలు తెలియకుండా కొన్ని పత్రికలు రాసిన వార్తలతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యా'నని చెప్పారు.

English summary
Actress Amala Paul is busy with her films, advertisements after getting separated from husband AL Vijay. She has been roped as a brand ambassadress for the Chandrika Ayurvedic soap since last three years.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu