»   » అమలాపాల్‌ డైవర్స్ నిజమే: భర్త స్పందన, వేరే వ్యక్తితో రిలేషనే కారణం?

అమలాపాల్‌ డైవర్స్ నిజమే: భర్త స్పందన, వేరే వ్యక్తితో రిలేషనే కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 2014 జూన్ 12న చెన్నైలో అమలాపాల్, విజయ్ పెళ్లి చేసుకున్నారు. అమల క్రిస్టియన్. విజయ్ హిందువు. నిశ్చితార్థం చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం, పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి.పెళ్లయిన కొత్తలో భర్తతో కలసి దిగిన ఫొటోలను అమల సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేసేవారు.

ఈ ఏడాది జనవరి 1న ఫేస్‌బుక్ ఫాలోయర్లకి 'న్యూ ఇయర్ విషెస్' చెప్పిన వీడియోలో భర్తతో కలసి కనిపించారు. ఆ తర్వాత ఈ జంట పబ్లిక్‌లో కనిపించలేదు. ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం అని పరిశీలకులు అన్నారు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారా? అని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

హీరోయిన్ అమలాపాల్‌ తన భర్త ఎ.ఎల్‌. విజయ్‌తో గత కొద్ది రోజులుగా విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు నిజమే అని తెలిసింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ భేదాభిప్రాయాల కారణంగా విడిపోవాలని అనుకుంటున్నట్లు తొలుత చెప్పుకొచ్చారు. అయితే అసలు నిజం వేరని తెలిసింది. ఈ విషయమై భర్త విజయ్ సైతం మీడియాతో మాట్లాడారు.

విజయ్ మాట్లాడుతూ... 'నేను ఈ విషయమై మాట్లాడటం అనవసరం. నేను మా తల్లి , తండ్రి ఎలా చెపితే అలా నడుచుకుంటాను, వారి నిర్ణయాన్ని గౌరవిస్తాను." అన్నారు. మరో ప్రక్క విజయ్ తండ్రి ఏఎల్.అళగప్పన్ స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విజయ్, అమలాపాల్ విడిపోయారని ఆయన ప్రకటించారు.

అందుతున్న సమాచారం ప్రకారం...అమలాపాల్‌ పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటించడం విజయ్‌ తల్లిదండ్రులకు ఇష్టంలేదట. దీంతో అమలాపాల్‌ను సినిమాల్లో నటించొద్దని చెప్పడంతో ఆమె దానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

విజయ్‌ కూడా తల్లిదండ్రుల మాటలతో ఏకీభవించడంతో ఇద్దరూ పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే మరో ప్రక్క అందుకు అసలు కారణం సినిమాలు కాదు..ఓ ఫ్యాషన్ డిజైనర్ తో అమలా పాల్ రిలేషన్ లో ఉండటమే అని చెన్నే వర్గాలు అంటున్నాయి.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో ...

సమంతే కీలకమా

సమంతే కీలకమా

తన ప్రమేయం ఏమీ లేకపోయినా అమలాపాల్‌ విడాకుల వ్యవహారంలో కూడా సమంత పేరు వినిపిస్తోంది.

కారణం అంటున్నారు

కారణం అంటున్నారు

అమలాపాల్‌.. తన భర్త ఏ ఎల్‌ విజయ్‌ నుంచి విడిపోవాలనుకోవడానికి సమంతే కారణమని కోలీవుడ్‌ జనాలు భావిస్తున్నారు.

సమంత ఇలా..

సమంత ఇలా..

కొన్ని రోజుల క్రితం తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ చిత్రం ‘వడ చెన్నై' నుంచి సమంత వాకవుట్‌ చేయటంతో కథ మొదలైంది

అయితే

అయితే

ఈ సినిమాలో సమంత స్థానంలో అమలాపాల్‌ను తీసుకున్నాడు ధనుష్‌. ఆ సూచన కూడా సమంతే చేసినట్టు సమాచారం.

నచ్చలేదు

నచ్చలేదు

వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు మీద అమలను వివాహం చేసుకున్న విజయ్‌కు.. ఆమె వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లడం నచ్చలేదట.

విభేధాలు

విభేధాలు

ముఖ్యంగా ఈ ‘వడ చెన్నై' సినిమా విషయంలోనే వారి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయట.

పూర్తి నిర్ణయం

పూర్తి నిర్ణయం

దీంతో ఎప్పట్నుంచో విడివిడిగా ఉంటున్న ఈ దంపతులు పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అలా..

అలా..

వీరి డైవర్స్ కు పరోక్షంగా సమంతే కారణమైనట్టు అయింది.

పోస్ట్ ఫోన్ అయ్యేవి

పోస్ట్ ఫోన్ అయ్యేవి

ఆ సినిమా సమంత చేసినా, లేదా అమలా పేరును సూచించకుండా ఊరుకున్నా ఈ విడాకులు పోస్ట్‌ పోన్‌ అయ్యేవట.

కాగా,

కాగా,

చాలాకాలంగా ఢిల్లీకి చెందిన ఓ పంజాబీ డిజైనర్‌తో అమలాపాల్‌ రిలేషన్‌షిప్‌లో ఉందట.

నటించింది

నటించింది

విజయ్‌ దర్శకత్వం వహించిన దీవ తిరుమగల్‌ చిత్రంలో అమలాపాల్‌ నటించారు.

అప్పుడే

అప్పుడే

వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారడంతో 2014 జూన్‌ 12న వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు.

విజయ్ డైరక్షన్

విజయ్ డైరక్షన్

ప్రభుదేవ, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తోండగా త్వరలో జయం రవి హీరోగా ఓ చిత్రాన్ని చేయనున్నారు.

అమలాపాల్ స్పందించలేదు

అమలాపాల్ స్పందించలేదు

ఈ డైవర్స్ విషయమై అమలాపాల్ మాత్రం ఇప్పటివరకూ స్పందిచలేదు

తెలుగుపైనా కన్ను

తెలుగుపైనా కన్ను

గతంలో రామ్ చరణ్ సరసన నాయక్, నాగ చైతన్య సరసన బెజవాడ చిత్రాలు చేసిన ఆమె తెలుగులో మళ్లీ రీఎంట్రీ ఇస్తుందంటున్నారు

నాన్న చిత్రంతో

నాన్న చిత్రంతో

విక్రమ్ హీరోగా వచ్చిన నాన్న చిత్రంలో అమలాపాల్ తొలిసారి విజయ్ డైరక్షన్ లో చేసింది అప్పుడే ప్రేమలో పడ్డారు.

English summary
Amala Paul is set to file divorce from her husband.Talking to newspaper, Amala Paul's husband Vijay said, 'I don’t want to talk anything about it. I will abide by my parent's decision."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X