»   » సన్నీలియోన్‌ ఇంకో కేసు.. అరెస్ట్ చెయ్యమని డిమాండ్

సన్నీలియోన్‌ ఇంకో కేసు.. అరెస్ట్ చెయ్యమని డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : అడల్ట్ స్టార్ ఇమేజ్ ని వదిలించుకుని బాలీవుడ్ హీరోయిన్ గా ఎదగాలనే సన్నీలియోన్ కి కలిసి వస్తున్నట్లులేదు. ఆమెపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆమె అర్ధనగ్న, నగ్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయంటూ, వాటి వలన యువత పెడదారిన పడుతోందంటూ కేసుల మీద కేసులు పడుతున్నాయి. రెండు రోజుల క్రితం ముంబై నుంచి ఓ సామాజిక కార్యకర్త ఈ విషయమై పిర్యాదు చేసిన విషయం మరువక ముందే మరో కంప్లైంట్ వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా చెన్నై, పోరూర్ కు చెందిన మోసస్ అనే సమాజ సేవకుడు నటి సన్నీలియోన్ పై నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ.. ఇటీవల ఒక కుర్రాడు తనను కలిశారన్నారు.అప్పుడు క్రికెట్ కళాకారుడు సునిల్‌గవాస్కర్ గురించి కొంత సమాచారం తెలుసుకోవడానికని అతని సెల్ ఫోన్లో సన్ని అనే పేరుతో నెట్‌ను ఓపెన్‌చేయగా, అందులో నటి సన్ని లియోన్ అశ్లీల దృశ్యాలు పలు చోటు చేసుకున్నట్టు తెలిపారు.

Another FIR registered against Sunny Leone

ఇలాంటి దృశ్యాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయని , బాల నేరస్తులుగా మార్చే అవకాశం ఉందని, కాబట్టి ఇలాంటి దృశ్యాలను ప్రవేశ పెట్టిన ఇంటర్నెట్ సంబంధించిన వారిని అశ్లీల ఫోజు ఇచ్చిన నటి సన్నిలియోన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక ఇప్పటికే...

వెబ్ సైట్లలో అశ్లీల చిత్రాలను ఉంచినందుకు సినీ నటి సన్నీలియోన్ పై థానే పోలీసులు కేసు నమోదు చేశారు. సన్నీ లియోన్ పై ఐపిసి సెక్షన్లు 292, 294ఎ, సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంజలి పలన్ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

మరో ప్రక్క సన్నిలియోన్ కు ..

దక్షిణాదిన క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. బాలీవుడ్‌ నటి సన్నీలియోని త్వరలో 'లవ్‌ యూ అలియా' అనే కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించి, ప్రత్యేక గీతంలో నృత్యం చేయనుంది. ఈ సినిమా దర్శకుడు ఇంద్రజిత్‌ మాట్లాడుతూ జూన్‌లో సన్నీలియోనికి సంబంధించిన భాగం చిత్రీకరిస్తామని తెలిపారు. హీరో సుదీప్‌ కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇది వరకే 'డికే' అనే కన్నడ సినిమాలో సన్నీ ప్రత్యేక గీతంలో నర్తించింది.

English summary
The police have booked actor Sunny Leone for obscenity after a right wing outfit filed complaint raising objection over some of her pictures shared on the Internet. Terming the Indo-Canadian actor’s website as one inducing lust in young minds, the complainant Moses from Chennai has demanded her deportation.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu