»   » ఒకే ఒక్కడులో మాదిరిగా కమల్‌ను సీఎం చేయాలి.. ప్రేమమ్ దర్శకుడు

ఒకే ఒక్కడులో మాదిరిగా కమల్‌ను సీఎం చేయాలి.. ప్రేమమ్ దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంశం రాజకీయమైనా సరే, సామాజికమైనా సరే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వారిలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ఒకరు. సమస్యలు, వివాదాలపై ఆయన స్పందించే తీరు కారణంగానే అభిమానులే కాదు, సినిమా ప్రముఖులు కూడా ఆయనను విపరీతంగా గౌరవిస్తారు. తాజాగా మలయాళ దర్శకుడు, ప్రేమమ్ ఫేం ఆఫోన్స్‌ పుత్రేన్‌ కమల్‌ గురించి సోషల్‌మీడియా సన్సేషనల్ కామెంట్స్ చేశారు. శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఒకే ఒక్కడు' చిత్రంలో అర్జున్‌‌ను ముఖ్యమంత్రి చేసినట్టు తమిళనాడు ముఖ్యమంత్రిగా కమల్‌హాసన్‌ ఒకరోజు చేయాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Appoint Kamal Hassan a chief minister for oneday, says premam director Alphonse Purthren

''ముదల్వన్‌' (తెలుగులో 'ఒకే ఒక్కడు') సినిమాలో లాగా ఒక్కరోజు ముఖ్యమంత్రిని నియమించే అవకాశం ఉంటే.. తమిళనాడు ప్రజల్ని చూసుకోవడానికి కమల్‌హాసన్‌ను ఒక్కరోజు ముఖ్యమంత్రిని చేయాలి. కేవలం ఒక్కరోజు చాలు. త్వరలో ఇది జరుగుతుందని ఆశిస్తున్నా. ఆయన తన వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వాన్ని మరోస్థాయికి తీసుకెళ్తారు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఈ పిల్లాడ్ని క్షమించండి' అని ఆఫోన్స్‌ పోస్ట్‌ చేశారు.

Appoint Kamal Hassan a chief minister for oneday, says premam director Alphonse Purthren
English summary
premam director Alphonse Purthren says that Appoint Kamal Hassan a chief minister for oneday like Oke Okkadu (mudhalavan). He said furthur that Kamal Hassan should be given one day for caring Tamil Nadu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu