»   » ఇది మ్యూజికా? మొదట్లో ఛీ కొట్టారు.. ఎన్నో అవమానాలు.. ఏఆర్ రెహమాన్

ఇది మ్యూజికా? మొదట్లో ఛీ కొట్టారు.. ఎన్నో అవమానాలు.. ఏఆర్ రెహమాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చిత్రం రోజా. ఆ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నుంచి ఆ తర్వాత వచ్చిన బొంబాయి, దిల్ సే చిత్రాలతోపాటు .... నిన్న మెన్న వచ్చిన రంగిదే బసంతి చిత్రాలకు ఆయన అందించిన సంగీతానికే కాదు... రెహమాన్ కు దేశ విదేశీ శ్రోతలతోపాటు సంగీతాభిమానులు ఫిదా అయిపోయారు. అయితే చిత్ర పరిశ్రమలో మణిరత్నం రోజా ద్వారా అడుగు పెట్టిన ఆయన అనాటి తన మనసులో చెలరేగిన భావాలను శుక్రవారం మీడియా ఎదుట మనసు విప్పి మాట్లాడారు.

  ఈ రంగంలో నిలబడగలనా ?

  ఈ రంగంలో నిలబడగలనా ?

  రోజా చిత్రం విడుదలైన వెంటనే ... సంగీత అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో దేశంలో చిత్ర పరిశ్రమలో హేమా హేమీలు లాంటి సంగీత దర్శకులు ఉన్నారు. అలాంటి వారి సంగీతం ముందు తన సంగీతం సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా ? అసలు ఈ రంగంలో నిలబడగలనా ? నిలబడినా మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే ఉంటానేమో అనుకున్నానని రెహమాన్ తెలిపారు.

  ఇదేమీ సంగీతం అని...

  ఇదేమీ సంగీతం అని...

  మరి కొద్ది రోజులకు మణి సార్ దర్శకత్వంలో తన రెండో చిత్రం బొంబాయికి దర్శకత్వం వహించాను. ఆ చిత్రం విడుదల అయింది. ఇదేమీ సంగీతం అని ప్రేక్షకులు అన్నారు. ఆ తర్వాత వరుసగా తన సంగీత దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాల పాటలు ప్రేక్షకులను సంగీత సాగరంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

  అమ్మ సంతోష పడింది...

  అమ్మ సంతోష పడింది...

  అలాగే రాక్ స్టార్, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాలకు సంగీతానికి అమ్మ అయితే చాలా సంతోష పడిందని... తన సంగీత దర్శకత్వంలో వచ్చిన అన్ని చిత్రాల పాటలు బాగున్నాయని అమ్మ చెప్పడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని రెహమాన్ పేర్కొన్నారు.

  కొన్ని పాటలే నచ్చుతాయి...

  కొన్ని పాటలే నచ్చుతాయి...

  కాగా తన సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటల్లో కొన్ని మాత్రమే నచ్చుతాయని అప్పుడప్పుడు తనను కలసి అభిమానులు చెబుతారని ఈ సందర్భంగా రెహమాన్ తెలిపారు. అయితే తాను మాత్రం మనసు పెట్టి మరీ నిబద్దతతో పాటలకు స్వర రచన చేస్తానని ఏఆర్ రెహమాన్ పేర్కొన్నారు.

  English summary
  Music Director AR Rahman shares his personal experiences recently with media. He said, I have always got a mixed response. When Roja came in, people said I will not sustain more than three months. Then Bombay came, people said what is this? Then Rockstar, Slumdog Millionaire, Mom happened. I accept it all."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more