twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సౌత్ ఇండియాలో రాబోయే పెద్ద సినిమా అదే

    By Srikanya
    |

    సూర్య సెవెంత్ సెన్స్ సినిమా విడుదల కావంటంతో ఇప్పుడు నెక్ట్స్ ఏ పెద్ద చిత్రం విడుదల కాబోతుందంటూ మార్కెట్లో అప్పుడే ఎంకర్వైలు మొదలయ్యాయి. అయితే సౌత్ ఇండియాలో తర్వాత విడుదలయ్యే క్రేజీ చిత్రం, పెద్ద చిత్రం అరవన్(తెలుగులో ఏకవీర). తమిళ దర్శకుడు వసంతబాలన్ 45 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆది హీరోగా తమిళంలో 'అరవన్' పేరుతో, తెలుగులో 'ఏకవీర' పేరుతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అమ్మ క్రియేషన్స్ సమర్పణలో 5 కలర్ మల్టీ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. '18వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనని, మహాభారతంలలో అర్జునుడు, ఉలూచికకు పుట్టిన ఐరానందుని కథను స్పూర్తిగా తీసుకుని వేషధారణలో ఆ తరాన్ని గుర్తు చేస్తూ నేటి ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా వసంతబాలన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.భారీ సెట్స్‌తో , హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ సినిమా తయారవుతోంది. ప్రముఖ గాయకుడు కార్తీక్ ఈ సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమవుతున్నారు. కర్నూలు గండికోటలో 18 రోజులు షూటింగ్ జరిగింది. ప్రస్తుతం బొబ్బిలి, హంపి, తలకోన పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమయ్యే ఈ అరవన్ చిత్రం తెలుగు,తమిళ బాషల్లో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

    రవిరాజపినిశెట్టి కుమారుడు ఆది హీరోగా చేస్తున్న ఈ చిత్రం అద్బుతమైన విజువల్స్ తో తెరకెక్కుతోందని చెన్నై వర్గాలు చెప్తున్నాయి.వెయిల్,షాపింగ్ మాల్ వంటి ఎమోషనల్ చిత్రాలు రూపొందించిన వంసంత బాలన్ ఈ చిత్రాన్ని ఓ ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా భావించి రాత్రింబవళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఇక ఆది అయితే ఈ పాత్రకు ప్రాణం పెడుతున్నట్లు చెప్తున్నారు.అలాగే ధనిష్క హీరోయిన్ గా చేస్తోంది.అలాగే ప్లే బ్యాక్ సింగర్ కార్తిక్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.ఇక ఈ చిత్రం గురించి దర్సకుడు వసంత్ బాలన్ మాట్లాడుతూ.. అరవన్ అంటే ధీరోదాత్తుడు వెనుతిరిగని వ్యక్తి,ఇంకా చెప్పాలంటే కేవలం పోరాడటానికే పుట్టిన వ్యక్తి అని అర్దం.ఇది పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన కధ.అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులుకు కొత్త అనుభూతి కలిగిస్తుందనుకుంటున్నాను అన్నారు. ఇక ఈ చిత్రం డబ్బిగ్ రైట్స్ ని తెలుగులో ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఓ యువ నిర్మాత తీసుకున్నట్లు తెలుస్తోంది. ధన్షిక, అంజరి, అర్చనకవి, శ్వేతామీనన్, విజయచందర్, పశుపతి, కరికాలన్, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, ఫొటోగ్రఫీ: సిద్దార్ట్, సమర్పణ: టి.శివ, నిర్మాత: దామెర శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వసంతబాలన్.

    English summary
    The next big movie in south India and this is the Tamil movie 'Aravan'. The film has Aadhi in the lead along with Pasupathy and this again is made on period backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X