»   » రజనీ 'కబాలి'నిర్మాత కలైపులి థాణుపై అరెస్టు వారెంట్‌

రజనీ 'కబాలి'నిర్మాత కలైపులి థాణుపై అరెస్టు వారెంట్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రీసెంట్ గా రజనీకాంత్ తో కబాలి వంటి భారీ చిత్రం నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత కలైపులి థాణు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై చెన్నై జూనియర్‌ సివిల్‌ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. కన్యాకుమారి జిల్లా పుదుకుడియిరుప్పులోని 'న్యూ థియేటర్‌' యజమాని డేవిడ్‌ ఆయనపై కోర్టుకు వెళ్లారు.

డేవిడ్ దాఖలు చేసిన పిటిషన్‌లో థాణు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, ఈ విషయమై గతంలో నాగర్‌కోవిల్‌ ప్రిన్సిపల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా వడ్డీతో సహా చెల్లించాలని 2013 జూన్‌ 13న కోర్టు ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదనీ, ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులను ఆదేశించాలని కోరారు.


Arrest Warrant To Cinema Producer Kalaipuli S.Thanu

ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రాగా 28లోపు థాణును అరెస్టు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. ఈ విషయమై స్పందించేందుకు కలైపులి ధాను అందుబాటులో లేరు.

English summary
Kanyakumari district Theatre owner David files a complaint against Producer Kalaipuli S.Thanu . The reason behind the arrest warrant is, already Kanniyakumari district court ordered Thanu to return David’s money worth Rs.2 lakh to him. But Thanu refused to obey the court order. So David filed the complaint against Thanu in Chennai High court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu