»   » నయనతారకు తెలియకుండా చేసుంటేనే తప్పు

నయనతారకు తెలియకుండా చేసుంటేనే తప్పు

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై: 'రాజా రాణి' కోసం నయనతార సమ్మతితోనే పెళ్లి చేసుకుంటున్నట్లు శుభలేఖల ప్రచారం చేశాం. ఇందుకు నయనతార అనుమతి తీసుకున్నాం. సినిమా కోసమే కదా.. ఫర్వాలేదని చెప్పారామె. ఆమెకు తెలియకుండా చేసుంటేనే తప్పు. నిజజీవితంలో సమస్యల్లో ఉన్న యువతితో సినిమా కోసం పెళ్లంటూ వార్తలు సృష్టించడం సబబేనా? అని మీడియా వారు అడిగిన ప్రశ్నకు హీరో ఆర్య ఇలా సమాధానమిచ్చారు.

అలాగే నయనతార, తన పై వస్తున్న వదంతులు గురించి చెప్తూ... సినీ పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులుంటారు. అందరితోనూ చాలా సన్నిహితంగా ఉంటా. పాఠశాల, కళాశాల, సినీ పరిశ్రమకు చెందినవాళ్లే అందరూ. వాళ్లతో ఉంటేనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోను అన్నారు.

'రాజా రాణి' హీరోయిన్స్ గురించి చెప్తూ... నయనతార, నశ్రియలతో కలసి నటించడం కొత్త అనుభూతి. వీరిలో నయన్‌ చాలా సీనియర్‌. 'బాస్‌ ఎన్గిర భాస్కరన్‌'లో నాతో జోడీగా కనిపించింది. ఇక నశ్రియా కొత్తమ్మాయి... కానీ అల్లరల్లరిగా చాలా వేగంగా ఉంటుంది. నయన్‌ చాలా నిదానంగా ఉంటుంది. నశ్రియాలకు నటించేందుకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో తమిళం కూడా నేర్పాను అన్నారు.


విశాల్ తో స్నేహం గురించి చెప్తూ... నేను, విశాల్‌ ఈ రంగంలోకి వచ్చాకే మిత్రులం కాదు. అంతకుముందే నాకు తెలుసు. ఇద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాం. అప్పట్లో వాళ్ల అన్న నటించేవారు. అసలు మేం ఇలా సినిమారంగంలోకి వస్తామని వూహించలేదు. తను తొలుత నటించడానికి వచ్చాడు. ఆ తర్వాత నేను అడుగుపెట్టా. అయితే చాలాకాలంగా ఇద్దరం కలసి నటించాలని అనుకున్నాం. అలా 'అవన్‌ ఇవన్‌'తో ఆ కోరిక నెరవేరింది అన్నారు.


'అరిందుం అరియామలుం'లో రౌడీ పాత్రతో తెరపై అడుగుపెట్టి ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు ఆర్య. అమ్మాయిల మనసు దోచుకోవడంతోపాటు అందర్నీ ఆకట్టుకుంటున్నాడీ 'బాస్‌..'. తాజాగా 'రాజా రాణి'లో నయన్‌, నశ్రియాలతో ఆడిపాడాడు. ఈ చిత్రంతో అభిమానుల్లో మరింతమంది అమ్మాయిలు చేరారనే చెప్పాలి. సరికొత్త ప్రేమ కథా చిత్రం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.పెళ్లి విషయం ప్రస్తావిస్తే.. ఇప్పుడేం అవసరముందని చెబుతున్నాడు. ఏదేమైనా ప్రేమించి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం ఖాయమంటున్నాడు.

English summary
Filmmaker these days don't hesitate to go to any lengths to get maximum publicity for their movies. The makers of Arya - Nayanthara-starrer, Raja Rani even got the lead pair married. It all began with a wedding card that's been doing the rounds on the internet. It read Arya weds Nayanthara and even carried th
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu