»   » సెల్వరాఘవన్ డైరెక్షన్ లో ఆర్యతో అనుష్క..

సెల్వరాఘవన్ డైరెక్షన్ లో ఆర్యతో అనుష్క..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు ప్రక్షకులను తన అందంతో, అభినయంతో మెప్పించిన అనుష్క, తమిళంలోను ప్రవేశించి అక్కడ కూడా తమిళ తంబిలను తన మాయలో పడగొట్టిందన్న విషయం తెలిసిందే. అంతే కాదు తమిళ ప్రభుత్వం ఆమెకు ప్రతిష్టాత్మక అవార్డు 'కలైమామణి' ని ఈ భామకు అందించింది. ఆమె తో పాటు యువ కథానాయకుడు ఆర్య కూడా కలైమామణి అవార్డు అందుకొన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక క్రేజి డైరెక్టర్ సినిమాలో నటించబోతున్నారు.

తెలుగులో ఇటీవల అవకాశాలు తగ్గిపోవడంతో కథానాయిక అనుష్క ఇప్పుడు తమిళం మీద బాగా కాన్సంట్రేట్ చేస్తోంది. తమిళంకి ప్రాధాన్యత ఇస్తానన్నట్టుగా ఫీలర్స్ పంపుతుండడంతో కోలీవుడ్ నిర్మాతలు ఆమెను కాంటాక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఆమె ఓ చిత్రాన్ని అంగీకరించింది. ఇందులో ఆర్య (వాడు-వీడు ఫేం) కథానాయకుడుగా నటిస్తాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కి వెళుతుంది. ఇదిలా ఉంచితే, అల్లు అర్జున్ తో కూడా సెల్వా మరో చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.

English summary
The maverick director Selva is back to his project Irandaam Ulagam, which is showing fast completion, with Dhanush in the lead. Immediately after the completion of this upcoming film, the director is soon to start his next film with yet another off-beat themed subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu