»   »  అశిన్ పై కిడ్నాప్ కేస్

అశిన్ పై కిడ్నాప్ కేస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Asin
దక్షిణాది భాషల్లో అతి తక్కువ కాలంలో పాపులర్ అయిన హీరోయిన్ అశిన్. ఆమెపై తాజాగా చెన్నైలో కిడ్నాప్ కేసు నమోదుఅయ్యింది. ఆమె దగ్గర పనిచేస్తున్న పనిపిల్ల తల్లి తన కూతురుని కిడ్నాప్ చేసి ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసారంటూ పోలీస్ కమీషనర్ కి పిర్యాదు చేసింది. దాంతో అసలేం జరిగిందంటూ ఎంక్వైరీ ప్రారంభమైంది. వాస్తవానికి ఆమె కూతురు చాలా కాలంగా అశిన్ దగ్గర పని చేస్తోంది. వారానికి ఒక రోజు ఆమెను కలుసుకునేదట. గత ఆరు నెలల కాలంగా అది జరగటం లేదట.దాంతో ఆమె కంగారుతో అశిన్ నివాసమైన గోల్డెన్ అపార్ట్ మెంట్స్ కి పరుగెత్తిందిట. కాని ఆ పిల్ల అక్కడ లేదట. అంతే గాక సెక్యూరిటీ వారు కూడా ఆమెను లోపలికి వెళ్ళి చూడనివ్వ లేదట.

దాంతో యోదో జరగరానేదేదో తన కూతురుకి జరిగిందని డౌట్ తెచ్చుకుని అశిన్ ఇంట్లో వారిపైనే అనుమానంగా ఉందంటూ ఆ కంప్లైయింట్ చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి అశిన్ ని సంప్రదిస్తే అసలు విషయం బయిటపడిందిట. గత కొంత కాలంగా ఆమె హిందీ సినిమా గజనీ షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్పింది. ఆ పిల్ల కూడా ఆమె తోనే ఉందట. మరి ఆ విషయం ఆ అమ్మకి చెప్పచ్చు కదా అని ఆ పిల్ల ని అడిగితే తన తల్లి ఎప్పుడూ డబ్బులు గురించే ఆరా తీస్తుందనీ అందుకనే తాను తల్లిని కలవటానికి ఇష్టపడటం లేదని తేల్చి చెప్పేసిందిట.కాని అశిన్ మాత్రం ఆమె తల్లిని పిలిచి కూతురుని చూపి డౌటు క్లియర్ చేసి పంపిందట. మొత్తానికి రీల్ లైఫ్ లోనే కాక అశిన్ రియల్ లైఫ్ లో కూడా కావల్సినంత డ్రామా జరుగుతోందని బాలీవుడ్ వారు చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X