Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షారుఖ్‌తో సినిమాపై క్లారిటీ.. విజిల్‌లో ఆ సీన్ ఇష్టమన్న అట్లీ
రాజా రాణి, తేరి, మెర్సెల్ సినిమాలతో వరుస హిట్లు కొట్టి.. ప్రస్తుతం విజిల్ సినిమాతో పలకరించేందుకు రెడీ అయ్యాడు దర్శకుడు అట్లీ. ఇళయ దళపతి విజయ్‌తో హ్యాట్రిక్ కొట్టి.. మరో సారి వారి కాంబినేషన్‌కు తిరుగులేదని నిరూపించేందుకు సిద్దమయ్యాడు.

ఆన్‌లైన్లోకి వచ్చిన అట్లీ..
రేపు సినిమా విడుదల కానుండగా.. అభిమానులతో కాసేపు ముచ్చటించేందుకు ఆన్‌లైన్‌లోకి వచ్చాడు. దీంతో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తీరిగ్గా జవాబులు చెప్పుకుంటూ కూర్చున్నాడు. ఈ క్రమంలో తమకు నచ్చిన ప్రశ్నలు, తెలుసుకోవాలనుకున్న విషయాల గురించి అడిగారు.

అభిమానుల ప్రశ్నలు..
మీరు చేసిన సినిమాలు తప్పా.. విజయ్ సినిమాలో మీకు నచ్చిన చిత్రం ఏంటి?, ఈ సినిమాలో ఏ సీన్ అంటే ఏంటి? నిర్మాత గురించి మీ అభిప్రాయం? ఏ ఆర్ రెహమాన్‌తో అనుభవం? ఇలా తమకు నచ్చినవిదంగా అట్లీని అడిగేశారు. అయితే అన్నింటిలో కెల్లా ఓ అభిమాని మాత్రం తీవ్ర ఆవేదనకు లోనై ఓ ప్రశ్నను అడిగినట్టు కనిపిస్తోంది.
|
షారుక్ సినిమాపై క్లారిటీ...
షారుక్ ఖాన్‌కు తాను పెద్ద అభిమానిని అని, మీరు ఆయనతో సినిమాను చేస్తున్నారా? లేదా? దయచేసి చెప్పండి.. మమ్మల్ని ఇగ్నోర్ చేయకండి అంటూ అట్లీని అడిగాడు. దీంతో అతనికి సమాధానం ఇస్తూ.. షారుక్ అంటే నాకు అమితమైన ప్రేమా, గౌరవం ఉన్నాయి.. ఆయన కూడా నా పనితనాన్ని ప్రేమిస్తాడు.. తప్పకుండా కచ్చితంగా మీరు అడిగిన దానిపై మేము ఏదోకటి చేస్తామని తెలిపాడు.

ఆ సీన్ అంటే ఇష్టం..
అలాగే మరో అభిమాని.. విజిల్‌లో ఏ సీన్ అంటే ఇష్టమని అడిగాడు. రైల్వే స్టేషన్ నుంచి క్లైమాక్స్ వరకు ఉండే సీన్ తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ఈ మూవీలో విజయ్ ఎన్ని పాత్రలను పోషిస్తున్నాడు.. రెండా ? మూడా? అని అడగ్గా.. తనకు లెక్కలు రావంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.