»   » సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సినిమా తీస్తా: రాజమౌళి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సినిమా తీస్తా: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో ఏదో ఒకరోజు సినిమా తీస్తా... అయితే ఎప్పుడు అనే విషయం ఇప్పుడే చెప్పలేదు. ప్రస్తుతం నా మదిలో బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదు అన్నారు దర్శకుడు రాజమౌళి.

బాహుబలి 2 తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో నిర్వహిస్తున్న సందర్భంగా ఓ స్టార్ హోటల్ చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం అయ్యారు. బాహుబలి 2 సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.


రాజమౌళి మాట్లాడుతూ...

రాజమౌళి మాట్లాడుతూ...

‘బాహుబలి వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపే ఓ కల్పిత కథ. అప్పడు పరిస్థితులు ఎలా ఉండేవో అలానే చూపించడం కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్, ఆయుధాలు డిజైన్ చేసాం మని రాజమౌళి తెలిపారు.


రెండు భాగాలు అందుకే

రెండు భాగాలు అందుకే

బాహుబలి కథ అంతా ఒకటే. కానీ నిడివి ఎక్కువగా ఉండటంతోనే రెండు భాగాలుగా తీశాం. మొదటి భాగం చూసిన ప్రేక్షకులకు తలెత్తిన అన్ని సందేహాలకు ‘బాహుబలి-2'లో సమాధానం దొరుకుతుందని రాజమౌళి తెలిపారు.


ప్రతి పాత్ర గురించి చెప్పేందుకే అవన్నీ

ప్రతి పాత్ర గురించి చెప్పేందుకే అవన్నీ

బాహుబలి చిత్రంలోని ప్రతీ పాత్ర ప్రజల్లోకి చొచ్చుకుని పోయింది. ఆ పాత్రలను కూలంకషంగా వివరించేందుకు టీవీ సీరీస్‌, యానిమేషన్స్‌, ఇతర రూపకాల్లో కొనసాగిస్తామని రాజమౌళి ఈ సందర్భంగా తెలిపారు.


తమిళ ప్రేక్షకులకు

తమిళ ప్రేక్షకులకు

సినిమా అనుకున్నపుడే తెలుగు, తమిళం, హిందీలో అని ప్లాన్ చేసాం. తమిళంలో తీయాలనుకున్నప్పుడు తమిళ మాతృకను కోల్పోకుండా నాజర్‌, సత్యరాజ్‌ తదితరులతో ప్రతీ విషయాన్ని చర్చించి ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు.


ప్రభాస్ మాట్లాడుతూ...

ప్రభాస్ మాట్లాడుతూ...

రాజమౌళి సృష్టించిన అద్భుత చిత్రం బాహుబలిలో నాకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. సత్యరాజ్‌ లాంటి పెద్ద నటుడి తలపై కాలు పెట్టి నటించేపుడు చాలా ఇబ్బంది పడ్డాను. తొలి భాగం మాదిరిగానే రెండో భాగాన్ని కూడా తమిళప్రేక్షకలు ఆదరిస్తారని కోరుకుంటున్నాను అని ప్రభాస్ అన్నారు. నేను తమిళనాడులోనే పుట్టాను. త్వరలోనే తమిళంలో నేరుగా సినిమా చేస్తాను అని ప్రభాస్ అన్నారు.


English summary
Ahead of the release of Baahubali 2, the makers have organised a very grand Tamil audio launch function at YMCA ground in Chennai. According to reports, several eminent personalities of Kollywood are likely to grace the event. Speaking at the press meet, actor Prabhas said that he was born in Chennai and that he would act in a Tamil film shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu