twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి-2’ మూవీకి నష్టాలు వస్తున్నాయంటూ.... హీరో విశాల్ కంప్లైంట్!

    ‘బాహుబలి-2’ మూవీ పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతోందని.... పైరసీకీ కారణమైన తమిళరాకర్స్ వెబ్ సైట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.... తమిళ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కంప్లైంట్ చేసారు.

    By Bojja Kumar
    |

    చెన్నై: ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన రూ. 1000 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి-2' మూవీ పైరసీ వల్ల తీవ్రంగా నష్టపోతోందని.... పైరసీకీ కారణమైన తమిళరాకర్స్ వెబ్ సైట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.... తమిళ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ కంప్లైంట్ చేసారు.

    విశాల్ తో పాటు తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు కొందరు ఆదివారం చెన్నై సిటీ పోలీస్ కమీషనర్ కరణ్ సింఘాల్ ను కలిసారు. తమిళ రాకర్స్ పేరుతో ఇంటర్నెట్ మాఫియా రన్ చేస్తూ, సినిమాలను పైరసీ చేస్తూ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

    బాహుబలి-2కు భారీ నష్టం

    బాహుబలి-2కు భారీ నష్టం

    బాహుబలి-2 సినిమాకు సంబంధించిన పైరసీ వెర్షన్ ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చిందని, దీని వల్ల బాహుబలి-2 సినిమాను డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని తెలిపారు.

    ఆధారాలతో సహా

    ఆధారాలతో సహా

    బాహుబలి-2 పైరసీ వెర్షన్ వెబ్ సైట్ల డౌన్ లోడ్ లింక్స్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ లింక్ వివరాలతో సహా కమీషనర్ కు సమర్పించారు. వీరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము మరింత నష్టపోవాల్సి వస్తుందని విన్నవించారు.

    కేబుల్ టీవీ పైరసీ

    కేబుల్ టీవీ పైరసీ

    సినీ పరిశ్రమకు కేబుల్ టీవీ పైరసీ కూడా పెద్ద తలనొప్పిగా మారిందని, ఎలాంటి రైట్స్ తీసుకోండానే లోకల్ కేబుల్ టీవీ నిర్వాహకులు కబాలి, తేరి లాంటి దాదాపు 300లకుపైగా సినిమాలను చట్టవిరుద్దంగా ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    పైరసీ మాపియా

    పైరసీ మాపియా

    పైరసీని అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, పైరసీ లింకులను ఎప్పటికప్పుడు పసిగట్టి బ్లాక్ చేస్తున్నా.... మళ్లీ కొత్త ఐపీతో మళ్లీ చేస్తున్నారని, వీటి సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల వీటి వెనక ఎవరు ఉన్నారన్న విషయం తెలుసుకోవడం కష్టం అవుతుందని అధికారులు అంటున్నారు.

    English summary
    Actor Vishal, who is also the newly elected president of Tamil Film Producers’ Council, has filed a police complaint against the piracy website Tamil Rockers for uploading pirated versions of director SS Rajamouli’s Baahubali: The Conclusion on several websites.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X