»   » దాన్ని దాటే సినిమా ఇక రాదు : రజనీకాంత్ (ఫొటొలు)

దాన్ని దాటే సినిమా ఇక రాదు : రజనీకాంత్ (ఫొటొలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తన కెరీర్‌లో 'బాషా' చిత్రాన్ని అధిగమించే చిత్రం మరొకటి ఉండదని హీరో రజనీకాంత్‌ అన్నారు. ఆ చిత్ర నిర్మాత, మాజీ మంత్రి ఆర్‌.ఎం. వీరప్పన్‌ 90వ పుట్టినరోజు వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్‌ మాట్లాడుతూ ''ఆర్‌.ఎం.వీరప్పన్‌ నుంచి నా జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు తెలిసి ఆయన ఆసుపత్రికి వెళ్లిన సందర్భం లేదు. ఆసుపత్రిలో ఎదురయ్యే సమస్యలు అనుభవించిన వ్యక్తిని నేను. అక్కడి కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దయచేసి అందరూ ఆసుపత్రి అవసరం రాని విధంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 50 ఏళ్లు దాటాక ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాయామం చేయాలి'' అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆయన నటిస్తున్న 'కబాలి' చిత్రం గురించి మాట్లాడుతూ, ''ఇది 'బాషా'ను మించుతుందా అని అందరూ అడుగుతున్నారు. 'బాషా'ను మించే సినిమా మరొకటి లేదు. వస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఎప్పటికీ ఒకే ఒక 'బాషా'నే. దానికి తిరుగులేదు'' అని చెప్పారు.

వేడుక ఫొటోలు స్లైడ్ షోలో...

కష్టమే...

కష్టమే...

"ఈ భాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు"అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగుని మరిచిపోవటం కష్టమే.

రీరిలీజ్ లోనూ

రీరిలీజ్ లోనూ

రజనీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రం భాషా ని మరో సారి 2011 నవంబర్ 4న చెన్నైలో విడుదల చేసారు.

అప్పట్లో..

అప్పట్లో..

1995 జనవరి 12 న విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం.

బడ్జెట్..

బడ్జెట్..

కేవలం పది కోట్ల వ్యయంతో తీసారీ చిత్రాన్ని.

రికార్డులు

రికార్డులు

భాషా చిత్రం దాదాపు యాభై కోట్ల వరకూ వసూలు చేసి రికార్డులు సృష్టించింది.

తెలుగులోనూ

తెలుగులోనూ

అంతేగాక ఈ చిత్రం తెలుగులోనూ మెగా హిట్టైంది.

2011లో రిలీజైనప్పుడు

2011లో రిలీజైనప్పుడు

చెన్నైలో నాలుగు ధియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజునుంచీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సాగింది.

టీవీల్లో పెద్ద హిట్

టీవీల్లో పెద్ద హిట్

ఈ చిత్రం టీవిల్లోనూ పెద్ద హిట్టే..ఎప్పుడు వేసినా టీఆర్పీలు అదురుతాయి

హంగామా

హంగామా

ఆ మధ్యన బాషా రిలీజైనప్పుడు రజనీ ఫ్యాన్స్ ఆ ధియోటర్స్ వద్ద భారీగా హోర్డింగ్స్ పెట్టి హంగామా చేసారు.

ప్రస్తుత చిత్రం విషయం

ప్రస్తుత చిత్రం విషయం

రజనీకాంత్‌ తాజా సినిమా 'కబాలి' విషయానికి వస్తే... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని విషయాలు బయిటకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

English summary
Rajinikanth took part in the 90th birthday celebrations of noted politician RM Veerappan in Chennai. During his speech, Rajinikanth admitted that he has been floured with the questions related to 'Baasha' ever since he signed 'Kabali' which is the story of a Chennai-based Don. "I have been asked by many people if 'Kabali' recreates the magic of 'Baasha'. There can be only one Baasha and it can't be recreated," he told.
Please Wait while comments are loading...