Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Beast Arabic Kuthu: యువ హీరో రాసిన పాటకు విజయ్ స్టైలిష్ స్టెప్పులు.. సాంగ్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న బీస్ట్ సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను నేడు విడుదల చేశారు. అరబిక్ స్టైల్ లో యువ హీరో శివ కార్తికేయన్ ఈ పాటను రచించగా యువ సంచలనం అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేశాడు. అరబిక్ కుత్తు లిరికల్ వీడియో సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. పాటలో విజయ్ డిఫరెంట్ స్టెప్స్ తో కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ పాటను టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేశాడు. ఇక పాటలో విజయ్ చాలా స్టైలిష్ గా స్టెప్పులు వేశాడు. అతనితో పాటు పూజా హెగ్డే కూడా పర్ఫెక్ట్ టైమింగ్ తో ఆకట్టుకుంది.
ఈ పాట చాలా డిఫరెంట్ గా ఉండడంతో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్నమైన షేడ్స్ లో అలరించబోతున్నాడు. బీస్ట్ అనే టైటిల్ తోనే సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ పాటతో కూడా మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే దాదాపు ఫినిష్ అయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో గ్లామరస్ లుక్ తో ఆకట్టుకోనుందట.

మాస్టర్ సినిమాతో తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ ఈసారి బీస్ట్ సినిమాను కూడా భారీగానే విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ను నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కించినట్లు టాక్ వస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఇదివరకే డాక్టర్ సినిమాతో ఒక బిగ్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ తో అంతకుమించి అనేలా విజయాన్ని అందుకునేలా ఉన్నాడు. విజయ్ బీస్ట్ సినిమా అనంతరం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దిల్ రాజు నిర్మించబోయే ఆ సినిమా కోసం విజయ్ దాదాపు 90కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
ఇక విజయ్ మాస్టర్ సినిమాతో మొదటిసారి తెలుగులో 10కోట్లకు పైగా షేర్ అందుకున్నాడు. ఒక విధంగా బయ్యర్లకు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చాయి. ఇక ఇప్పుడు చేస్తున్న బీస్ట్ సినిమాకు అంతకుమించి అనేలా బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద బీస్ట్ ఏ రేంజ్ లో రికార్డులను అందుకుంటాడో చూడాలి.