»   » శింబుపై కేసుపెట్టిన వ్యక్తి నుంచి పోలీసులు

శింబుపై కేసుపెట్టిన వ్యక్తి నుంచి పోలీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ‘బీప్‌ సాంగ్‌'కు సంబంధించి నటుడు శింబుపై కేసు పెట్టిన వ్యక్తి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. మహిళలను బీప్‌ సాంగ్‌ మరింత హేళన చేస్తోందని ఆ పాట పాడిన శింబు, సంగీతం సమకూర్చిన అనిరుధ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పొన్నుస్వామి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఆయన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు టెక్నాలజీ యాక్ట్‌ 67, ఐపీసీ 299 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పొన్నుస్వామి నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ పాటతో కలిగిన నష్టం, ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆయన వాంగ్మూలం నమోదుచేశారు.

అనిరుధ్‌ సంగీత దర్శకత్వంలో శింబు పాడిన ‘బీప్‌ సాంగ్‌' ప్రస్తుతం తమిళనాడులో పెద్ద సంచలనమైంది. మహిళలను కించపరిచే రీతిలో అసభ్య పదజాలంతో తమిళ సినీ నటుడు శింబు పాడిన బీప్ సాంగ్ వివాదం రాజు కుంది. మహిళా సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కోయంబత్తూరు రేస్ కోర్సు పోలీసులు కేసు నమోదు చేసి, సమన్లు జారీ చేశారు. ఈ విషయం వెల్లడైనప్పటి నుంచి నటుడు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతకీ ఇంత సంచలనం రేపిన ఆ సాంగ్ ఏంటి అంటే ఇదిగో ..ఇది...

మహిళలను కించపరిచే రీతిలో పాట పాడిన శింబు, అనిరుధ్‌లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘం, ప్రజాస్వామ్య యువత సంఘం తరపున సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాయం ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను దగ్ధం చేసేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. తర్వాత ఆందోళన కారులు శింబు, అనిరుధ్‌ల చిత్రపటాలను చింపేసి నిరసన తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా పాటను రూపొందించిన వారిపై బెయిలుకు వీల్లేని కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

English summary
Tamil Nadu Milk Producers and Vendors Association president S A Ponnusamy, on whose complaint police filed Sunday's FIR against Simbu and Anirudh
Please Wait while comments are loading...