Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మీరు కోరినవన్నీ ఇచ్చాం.. ముందు స్టార్ట్ చేయండి: కమల్ హాసన్‌కి బహిరంగ లేఖ
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్‌కి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. కొన్నేళ్ల క్రిందట శంకర్ దర్శకత్వంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రాబోతుండటంతో జనాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ కమల్ హాసన్‌కి బహిరంగ లేఖ రాయడం హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

సెట్స్‌పై ఘోర ప్రమాదం.. ఉలిక్కిపడ్డ ఇండస్ట్రీ
ఇటీవలే భారతీయుడు 2 సెట్స్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. షూటింగ్ జరుగుతుండగా భారీ క్రేన్ విరిగిపడటంతో అక్కడికక్కడే ముగ్గురు యూనిట్ సభ్యులు మృతి చెందారు. మరో పదికి గాయాలయ్యాయి. డైరెక్టర్ కూడా గాయపడ్డారు. ఈ ఘటనతో తమిళ సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది.

కమల్ హాసన్ భావోద్వేగం.. ఆర్ధిక సాయం
ఊహించని
ఈ
దుర్ఘటనపై
భారతీయుడు
2
యూనిట్
సహా
టాలీవుడ్,
కోలీవుడ్
సినీ
పెద్దలందరూ
స్పందించారు.
హీరో
కమల్
హాసన్
అయితే
ఈ
ప్రమాద
వార్తను
జీర్ణించుకోలేక
పోయారు.
ప్రమాద
స్థలికి
చేరుకొని
సహాయక
చర్యలు
చేపడుతూ
తీవ్ర
భావోద్వేగానికి
గురయ్యారు.
అదేవిధంగా
బాధిత
కుటుంబాలకు
కోటి
రూపాయల
ఆర్ధిక
సాయం
కూడా
ప్రకటించారు.

డైరెక్టర్ శంకర్ ఆవేదన
మరోవైపు
డైరెక్టర్
శంకర్
ఈ
ఘటనపై
స్పందిస్తూ..
ఈ
ప్రమాదం
నుంచి
ఇంకా
కోలుకోవడం
లేదని,
నిద్రలేని
రాత్రులను
గడుపుతున్నానని
అన్నారు.
ఆ
క్రేన్
ఏదో
తన
మీద
పడితే
బాగుండేదంటూ
ఆయన
ట్వీట్
చేయడంతో
మరోసారి
ఈ
అంశం
చర్చల్లో
నిలిచింది.

కమల్ హాసన్ ఫైర్.. బహిరంగ లేఖ
ఇదిలా ఉంటే ఈ ప్రమాదం విషయమై హీరో కమల్ హాసన్, లైకా సంస్థపై ఫైర్ అయ్యాడు. ఘటనపై వివరణ, మృతులకు ఆర్థిక సహాయం వంటి వాటిపై చర్యలు తీసుకుంటేనే షూటింగ్‌లో పాల్గొంటానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు స్పందించిన లైకా సంస్థ కమల్ హాసన్‌కు ఓ బహిరంగ లేఖ ఇచ్చింది. ఇందులో సదరు ప్రమాదం, ఆర్థిక సాయం గురించి ప్రస్తావించింది.

బాధిత కుటుంబాలకు అండగా లైకా సంస్థ
సెట్స్
పై
జరిగిన
ఈ
దురదృష్టకరమని,
బాధిత
కుటుంబాలకు
అండగా
ఉంటున్నామని
లైకా
సంస్థ
తెలిపింది.
ఇప్పటికే
బాధిత
కుటుంబాలకు
2
కోట్ల
రూపాయల
ఆర్థిక
సాయం
అందించామని..
గాయపడిన
వారికి
మెరుగైన
చికిత్స
అందిస్తున్నామని
తెలిపింది.
Recommended Video

— Lyca Productions (@LycaProductions) February 26, 2020 |
కమల్ దృష్టికి రాలేదేమో! ముందు స్టార్ట్ చేయండి
అయితే ఇలాంటివన్నీ కమల్ దృష్టికి రాకపోవడం వల్లే ఆయన అలా ఫైర్ అయినట్లుగా భావిస్తున్నామని లైకా సంస్థ పేర్కొంది. షూటింగ్ సమయంలో అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని, ప్రొడక్షన్ భీమాతో పాటు, వ్యక్తిగత భీమాలు సకాలంలో వచ్చేట్టు చూస్తామని.. ఇలా మీరు కోరినవన్నీ చేస్తున్నామని, ఇక సినిమా షూటింగ్ ప్రారంభిస్తే బాగుంటుందని ఆ లేఖలో రాసుకొచ్చింది లైకా ప్రొడక్షన్స్.